Jogi Ramesh: సినిమా స్టైల్‌లో చంద్రబాబు నాటకాలు వేస్తున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jogi Ramesh Fires On Chandrababu Naidu: ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సినిమా స్టైల్‌లో జనం ముందు నాటకాలు వేస్తున్నారని మంత్రి జోగి రమేశ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చంద్రబాబు వ్యాఖ్యలు ప్రజలను కాటు వేసేలా ఉన్నాయని మండిపడ్డారు. సీఎంగా తానేం చేశానో చెప్పుకుని ఓట్లడగటం సహజమని.. కానీ అలాంటిదేమీ లేకుండా చంద్రబాబు జనాన్ని కాటు వేస్తున్నారని విమర్శించారు. 86 నియోజకవర్గాల్లో టీడీపీకి దిక్కేలేదని వారి సొంత సర్వేలోనే తేలిందన్నారు. గతంలో ఏవైనా మంచిపనులు చేస్తే జనం గుర్తు పెట్టుకుంటారని.. అవి చేయకపోవడం వల్లే 23 సీట్లకు దించేశారని ఎద్దేవా చేశారు.
ఇక పవన్ కళ్యాణ్ ‘ప్యాకేజీ’ కోసం ఎన్ని డ్రామాలైనా చేస్తాడని జోగి రమేశ్ కౌంటర్ వేశారు. బీసీల్లో 82 వేల మందిని సీఎం జగన్ లీడర్లుగా తయారు చేశారని.. రాష్ట్రమంతా జయహో బీసీ, జయహో జగనన్న అనే నినాదం మార్మోగుతోందని జోగి రమేశ్ పేర్కొన్నారు. లోకేష్ ఒక రాజకీయ అజ్ఞాని, అక్కుపక్షి అని.. అందుకే ఇష్టానుసారం ట్వీట్లు పెడుతున్నారని ఫైర్ అయ్యారు. రాష్ట్రానికి రాష్ట్రపతి వచ్చినప్పుడు, భద్రతలో భాగంగా కొన్ని ఏర్పాట్లు చేస్తే, దానిమీద కూడా విమర్శలు చేయటం ఒక్క లోకేష్‌కే చెల్లిందన్నారు. ఇలాంటి నీచమైన సంస్కృతికి చంద్రబాబు, లోకేష్ అలవాటు పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పిచ్చికుక్కల్లాగా జనాన్ని కాటు వేస్తున్నారని.. బీసీల గురించి మాట్లాడే అర్హత టీడీపీకి లేదని తేల్చి చెప్పారు. 14 ఏళ్లు సీఎంగా ఉండి కూడా.. చంద్రబాబు ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు.
Also Read
- AP Local Body Election Schedule 2026: ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.. పూర్తి షెడ్యూల్ ఇదే..
- Ambati Rambabu: వైసీపీ కేడర్ను భయపెడుతున్నారు.. రౌడీషీట్లపై అంబటి ఆగ్రహం
- Vijayawada Drugs: బెజవాడలో మరోసారి డ్రగ్స్ కలకలం.. ఎంబీఏ విద్యార్థిని అరెస్ట్!
- AP Municipal Elections 2026: సీట్ల సర్దుబాటుపై ఎన్డీఏ కీలక భేటీ.. 40 శాతం వాటా కోరుతున్న జనసేన!
ఇదే సమయంలో.. స్కిల్ డెవలప్మెంట్ అక్రమాల కేసులో చంద్రబాబు, లోకేష్ పాత్ర కూడా ఉందని జోగి రమేశ్ బాంబ్ పేల్చారు. వారికి కూడా నోటీసులు ఇవ్వాలని, అందరి తప్పులూ బయటకు వస్తాయని అన్నారు. వారిద్దరు కూడా జైల్లోకి పోవడం ఖాయమన్నారు. చంద్రబాబు, పవన్ ఇద్దరూ ప్రజల్ని రెచ్చగొడుతున్నారని.. చంద్రబాబు చేస్తోందని విష ప్రచారమని ప్రజలే తిట్టుకుంటున్నారని అన్నారు. చంద్రబాబుని నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరన్నారు.
తాజావార్తలు
-
AP Local Body Election Schedule 2026: ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.. పూర్తి షెడ్యూల్ ఇదే..
-
Yash: చేసిన తప్పునే మళ్ళీ మళ్ళీ చేస్తున్న యష్?
-
Airtel rs348 vs rs349 Recharge Plan: కేవలం రూ.1 తేడా.. ఎయిర్టెల్లో రూ.348, రూ.349 ప్లాన్స్.. ఏది బెస్ట్ అంటే?
-
Tamannaah: బోల్డ్ సీక్వెల్లో తమన్నా? విద్యాబాలన్ మార్క్ను దాటగలదా!
-
Mary Millben: CJPకి అమెరికా నుంచి నిధులు.. అమెరికన్ సింగర్ సంచలన ఆరోపణలు..
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..