మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డికి చెందిన ట్రావెల్స్ బస్సు మంటల్లో పూర్తిగా దగ్ధమైంది. అనంతపురంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని జేసీ దివాకర్ ట్రావెల్స్ కార్యాలయం వద్ద ఈరోజు తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. ట్రావెల్స్ కార్యాలయం వద్ద మొత్తం నాలుగు బస్సులను నిలిపి ఉంచగా.. ఇందులో ఒకటి పూర్తిగా దగ్ధమైంది. మరో బస్సు పాక్షికంగా కాలిపోయింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. జేసీ ట్రావెల్స్ బస్సు దగ్ధంపై పోలీసులు…
JC Prabhakar Reddy: జేసీ ట్రావెల్స్‌పై పలు కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే.. తప్పుడు సమాచారం ఇచ్చి, ఫోర్జరీలకు పాల్పడ్డారని.. రవాణా శాఖ ఫోర్జరీ సంతకాలు, దొంగ స్టాంపులు, నకిలీ పత్రాలతో అధికారులను మోసం చేస్తూ అక్రమాలకూ పాల్పడ్డారన్న ఆరోపణలతో కేసులు పెట్టారు.. తాజాగా మరో వ్యవహారంలో జేసీ ప్రభాకర్‌రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయ్యింది.. అయితే, ఇవాళ మీడియాతో మాట్లాడిన తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి.. నకిలీ ఇన్సూరెన్స్…