బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా నిలకడగా బ్యాటింగ్ చేస్తోంది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్‌కు మంచి శుభారంభం లభించింది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (15), ఉస్మాన్ ఖవాజా (50 నాటౌట్) మొదటి వికెట్‌కు 50 పరుగులు భాగస్వామ్యం అందించారు. అయితే కాసేపటికే వార్నర్‌ను షమీ ఔట్ చేయడంతో తొలి వికెట్ పార్ట్‌నర్‌షిప్‌కు బ్రేక్ పడింది. అనంతరం క్రీజులోకి వచ్చిన లబుషేన్ (18), స్టీవ్ స్మిత్ (0)ను ఒకే ఓవర్లో ఔట్ చేసిన అశ్విన్.. టీమిండియాకు మంచి బ్రేక్ ఇచ్చాడు. ఓ ఎండ్‌లో వికెట్లు పడుతున్నా ఖవాజా అద్భుత హాఫ్ సెంచరీతో ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. ఇతడితో పాటు ట్రెవిస్ హెడ్ (1) క్రీజులో ఉన్నాడు. దీంతో లంచ్ సమయానికి ఆసీస్ 25 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 94 రన్స్ చేసింది.
Also Read: Big Breking: పేలిన బెలూన్లు.. అంబర్ పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కు గాయాలు