Jana Sena Yuvashakti Sabha: ఈ నెల 12వ తేదీన రణస్థలంలో జరిగే యువశక్తి సభకు పేర్ల నమోదు చేసుకోవాలని జనసేన పిలుపునిచ్చింది.. దీని కోసం ప్రత్యేక ఫోన్ నెంబర్, ఈ మెయిల్ ఐడీ కేటాయించినట్టు ఓ ప్రకటన విడుదల చేశారు జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్.. ఫోన్ నంబరు 080 69932222, vrwithjspk@ janasenaparty.org సంప్రదించి పేర్ల నమోదుకు అవకాశం ఉందన్నారు.. యువశక్తిలో మీ గళం వినిపించండి.. పేర్ల నమోదుకు ప్రత్యేక ఫోన్ నంబరు, ఈ-మెయిల్ ఐడీ కేటాయించాం.. యువశక్తి కార్యక్రమంలో సామాన్య యువతీ, యువకులు వేదిక నుంచి మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సూచించారని పేర్కొన్నారు.
Read Also: Best plans of 2023: బెస్ట్ ఇయర్లీ ప్లాన్స్.. జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ అదిరిపోయే ఆఫర్స్..
ఉత్తరాంధ్ర ప్రజల బతుకు వేదన, వలసల నిరోధం, మత్స్యకారుల రోదనలు చెప్పుకునేందుకు యువశక్తి ఓ వేదిక కానుందన్న మనోహర్.. ఉద్దానంలో ఆరోగ్య క్షీణత, ఉత్తరాంధ్ర అభివృద్ధికి భవిష్యత్తు ఆలోచనలు, ఇతర సమస్యలతో పాటు స్ఫూర్తివంతమైన విజయ గాధలు తెలపాలన్నారు.. ఈ వేదిక నుంచి యువతరం తమ ఆలోచనలు పంచుకోవచ్చు. జనసేన అధ్యక్షులుపవన్ కళ్యాణ్ సమక్షంలో తమ గుండె గొంతుకను వినిపించవచ్చు. దీనిలో పాల్గొనేందుకు జనవరి 5వ తేదీ నుంచి 8వ తేదీలోపు యువతీ యువకులు తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు అన్నారు. వాయిస్ రికార్డర్ ద్వారా పని చేసే ఈ ఫోన్ నంబరులో యువతీ యువకులు ఏ అంశం మీద మాట్లాడాలి అనుకుంటున్నారో క్లుప్తంగా వాయిస్ రికార్డు చేసి చెప్పవచ్చు.. లేదా ఈ-మెయిల్ కు తగిన వివరాలను పంపవచ్చు అని వివరించారు.. ఇక, ఆ వివరాలను పరిశీలించి పార్టీ కార్యాలయం నుంచి మీకు తగిన సమాచారం వస్తుందని తన ప్రకటనలో పేర్కొన్నారు పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్.