అది కౌరవ సభ.. గౌరవం లేని సభ : చంద్రబాబు ఫైర్

టీడీపీ పార్టీ ఆఫీస్‌ లో నిర్వహించిన ప్రెస్ మీట్లో భోరున విలపించారు చంద్రబాబు. అనంతరం వైసీపీపై ఫైర్ అయ్యారు చంద్రబాబు. తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఇలా జరగలేదని… రెండున్నరేళ్లుగా ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అవమానాలకు గురి చేస్తూనే ఉన్నారని మండిపడ్డారు. పార్టీ కార్యకర్తలను హింసించేవారు.. బూతులు తిట్టారు.. అయినా భరించామని.. బీఏసీలో అచ్చెన్నాయుడుతో వ్యంగ్యంగా సీఎం జగన్ మాట్లాడారని ఆగ్రహించారు.

అన్నీ భరించి అసెంబ్లీకి వెళ్తే.. నా భార్యను రాజకీయాల్లోకి లాగుతున్నారని… నా భార్య వ్యక్తిత్వ హననానికి పాల్పడుతోంది వైసీపీ అని ఫైర్‌ అయ్యారు. ప్రజలు ఓట్లేసి 151 సీట్లు వైసీపీకిచ్చి.. మాకు 23 స్థానాలు ఇచ్చినా నేను బాధపడలేదన్నారు. కానీ ఈ ప్రభుత్వం ప్రజల పాలిట భస్మాసుర హస్తంగా మారిందని.. ఇది కౌరవ సభ.. గౌరవం లేని సభ అంటూ చురకలు అంటించారు. ప్రతిపక్షంలో ఉండే వ్యక్తులని నా జీవితంలో ఎప్పుడూ చులకనగా మాట్లాడలేదన్నారు. జాతీయ స్థాయిలో పెద్ద పెద్ద నేతలతో పని చేశామని.. ప్రజల కోసం రాజకీయం చేస్తున్నామని గర్వంగా ఫీలయ్యేవాళ్లమని తెలిపారు.

Related Articles

Latest Articles