ఛత్తీస్‌గడ్‌లో మరోసారి పోలీసులకు మావోయిస్టులకు మధ్య కాల్పులు జరిగాయి. దంతెవాడ జిల్లా గోండెరాస్ అటవీ ప్రాంతంలో ఈ కాల్పులు జరిగాయి. అయితే ఈ కాల్పుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి చెందారు. మృతి చెందిన మహిళా మావోయిస్టులు హిద్మే కొహ్రమె, పొజ్జె లుగా పోలీసులు గుర్తించారు. అయితే హిద్మే తలపై రూ.5లక్షలు, పొజ్జె తలపై రూ.లక్ష రివార్డు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఏజేన్సీలో అనుమానం ఉన్న ప్రాంతాల్లో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నప్పుడు ఈ కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది.…
విశాఖలో ఇద్దరూ మహిళా మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. విశాఖ ఎస్పీ కృష్ణారావు ఎదుట మహిళా మావోయి స్టులు తాంబేలు సీత అలియాస్ నిర్మల, పాంగి లచ్చి అలియాస్ శైలు సరెండర్ అయ్యారు. వీరిరువూరు పలు ఘటనలలో, నేరాల్లో నిందితులుగా ఉన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పెద బయలు దళానికి చెందిన ఇద్దరు మహిళా మావోయిస్టులు అనేక నేరాల్లో పాల్గొన్నారని తెలిపారు. అనారోగ్య కారణాలతో పాటు ప్రజల నుంచి మావోయిస్టులకు ఆదరణ లభించకపోవడంతో లొంగిపోయారన్నారు. ఇద్దరు…