మాకు ప్రజా బలం ఉంది, పోలీసులు అవసరం లేదు: చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కడపజిల్లా బద్వేలు ఉప ఎన్నిక సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి ప్రతిపక్ష పార్టీలపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అడగడం రాజకీయ పార్టీల బాధ్యత అని, తమకు ప్రజా బలం ఉందని, పోలీసులు అవసరం లేదన్నారు. కేంద్రంలో అధికారం ఉందన్న గర్వంతో బీజేపీ ప్రజలను ఓట్లు అడగకుండా పత్రిక సమావేశాలకు పరిమితమై పోయిందన్నారు. ప్రభుత్వం పై బురద జల్లేందుకే ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయన్నారు.
ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వం ఇది చెయ్యలేదని ప్రశ్నించలేని పరిస్థితి ప్రతిపక్షాలదని ఆయన అన్నారు. సోమశిల నిర్వాసితులకు అన్నివిధాల న్యాయం చేస్తామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు శ్రీకాంత్ రెడ్డి.. ప్రతి రైతుకు 6 నుంచి 10 లక్షలు నష్టపరిహారం ఇచ్చిన ఘనత వైఎస్సార్ ది అని. సోమశిల విషయంలో పెండింగ్‌లో ఉన్న 19 వేల అప్లికేషన్లలో అర్హులైన అందరికి వన్ టైం సెటిల్ మెంట్ చేస్తామన్నారు.
Also Read
- Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
- Amaravati Flood Control System: 200 ఏళ్ల వర్షపాతంపై అధ్యయనం.. అమరావతి వరద నియంత్రణకు పక్కా ప్లాన్..!
- Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
నిష్పక్షపాత ఎన్నికలు జరగాలని మేము కూడా కోరుకుంటున్నామని, ఎన్నికల కమిషన్‌ను మేము కూడా అడుగుతామని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. బీజేపీ నేతలు మందిమార్బలంతో వచ్చి అధికారులపై ఆరోపణలు చేస్తున్నారు. పారా మిలటరీ బలగాలతో హడావుడి చేయాలని బీజేపీ ప్రయత్నిస్తుందన్నారు. మొత్తం ఆర్మీ బలగాలు దించినా ఏం కాదన్నారు. కాంగ్రెస్ , బీజేపీ కలయికతోనే రాష్ట్ర విభజన జరిగిందన్నారు.
మాకు రాజకీయ ప్రయోజనాల కంటే రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమని విభజన చట్టంలోని ఉన్న హామీలనే అడుగుతున్నామని ఆయన పేర్కొన్నారు. ప్రత్యేక హోదా, దుగరాజపట్నం , స్టీల్ ప్లాంట్ ఇస్తే పోటీ నుంచి విరమించుకుంటాం. పెట్రోల్ , డీజిల్ , గ్యాస్ ధరలు ఎందుకు పెంచుతున్నారు.. ఎందుకు మాట్లాడడం లేదు. వ్యక్తిగతంగా దూషణలు, ఆరోపణలు చేయడం సంస్కారం కాదన్నారు. ప్రత్యేక హోదా ఇస్తామని స్వయంగా ప్రధాని చెప్పారు.
ఆదినారాయణ రెడ్డి ఆరోపణలు కేవలం కేంద్రంలో పదవి కోసమేనని శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం రాజకీయ భిక్ష పెట్టినవారిపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. డిపాజిట్లు రావని తెలిసి ప్రచారం వదిలేసి అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఉనికి కాపాడుకోవడం కోసం ఆరాట పడుతున్నారు. ప్రజల్లోకి తిరిగి ఓట్లు అడగండి. ప్రెస్ మీట్లకు పరిమితమై ఆరోపణలు చేయడం మానుకోవాలని సూచించారు. టీడీపీ ఢిల్లీ పర్యటన గురించి మాట్లాడ్డం అనవసరం. మోడీ అంతు తెలుస్తానని చెప్పిన చంద్రబాబు తరువాత వంగి వంగి దండాలు పెట్టారన్నారు. ఏదో రకంగా ప్రచారం కావాలని టీడీపీ కోరుకుంటుందని చంద్రబాబు గురించి అందరికి తెలుసునని శ్రీకాంత్ రెడ్డి అన్నారు.
తాజావార్తలు
-
Aishwarya Lekshmi: బన్నీ – అట్లీ కాంబోలో ఈ బ్యూటీ లేనట్టే! అసలు సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్ ..
-
Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
-
Flydubai Attack: అల్-ఖైదా ఫోటోలు, తీవ్రవాద భావాలు.. కో-పైలట్ ఉగ్రకోణం బట్టబయలు..!
-
Heart Attacks: 18ఏళ్లకే గుండెపోటు.. కారణాలు ఇవే!
-
Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!