కడపజిల్లా బద్వేలు ఉప ఎన్నిక సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి ప్రతిపక్ష పార్టీలపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అడగడం రాజకీయ పార్టీల బాధ్యత అని, తమకు ప్రజా బలం ఉందని, పోలీసులు అవసరం లేదన్నారు. కేంద్రంలో అధికారం ఉందన్న గర్వంతో బీజేపీ ప్రజలను ఓట్లు అడగకుండా పత్రిక సమావేశాలకు పరిమితమై పోయిందన్నారు. ప్రభుత్వం పై బురద జల్లేందుకే ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయన్నారు. ప్రజల్లోకి వెళ్లి…