వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 12 వసంతాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ప్లీనరీ వేడుకలు గుంటూరు వేదికగా ఘనంగా జరుగుతున్నాయి. నేడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని పురస్కరించుకొని ఇడుపులపాయలో గల దివంగత నేత రాజశేఖర్ రెడ్డి ఘాట్ వద్ద కుటుంబ సమేతంగా సీఎం జగన్ నివాళులు అర్పించారు. అనంతరం సీఎం జగన్ గుంటూరు చేరుకున్నారు. గుంటూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభ ప్రాంగణంలో వైసీపీ జెండాను ఆవిష్కరించి వైసీపీ ప్లీనరీ వేడుకలను ప్రారంభించారు. అయితే ఈ ప్లీనరీ వేడుకల్లో పాల్గొనేందుకు రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల నుంచి తరలి వచ్చారు వైసీపీ కార్యకర్తలు.
CM Jagan : ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నా
కాకాని నుంచి ప్లీనరీ వరకు సర్వీస్ రోడ్ వైసీపీ శ్రేణులతో నిండిపోయింది. రెండు కిలో మీటర్ల మేర బారులు తీరాయి కార్లు, వాహనాలు. కాలినడకన ప్లీనరీ ప్రాగంణాన్ని కార్యకర్తలు చేరుకుంటున్నారు. సర్వీస్ రోడ్ నుంచి గుట్టెక్కి వచ్చి హైవే మీదకు చేరుకొని ప్లీనరీకి వెళ్తోంది వైసీపీ క్యాడర్. ప్లీనరీ తర్వాత కార్యకర్తల్లో మరింత జోష్ వస్తుందంటున్నారు క్యాడర్. అయితే ఇప్పటికే ప్లీనరీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో ఊహించనట్టుగా.. వైసీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.