Sivaji:సినీ నటుడు శివాజీ గురించి పెద్దగా ఎవరికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇక గత కొంతకాలంగా సినిమాలకు బ్రేక్ చెప్పి రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటున్నాడు. గత ఎన్నికల్లో ఆపరేషన్ గరుడ పేరుతో శివాజీ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఏదైనా బ్రేకింగ్ న్యూస్ రావడం ఆలస్యం దానిపై సుదీర్ఘ వివరణ ఇవ్వడానికి శివాజీ రెడీ అయిపోతాడు. ఇక తాజాగా ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో లీక్ కావడంతో మరోసారి వెలుగులోకి వచ్చాడు. బుధవారం తూర్పుగోదావరి జిల్లా ఉత్తర కంచిలో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరైన శివాజీ గోరంట్ల మాధవ్ వీడియోపై సెటైర్లు వేశాడు.
మాధవ్ గురించి జగన్ కూడా ముందే తెలుసని, కానీ కొన్ని పాలిటిక్స్ వలన చెప్పలేకపోతున్నాడని చెప్పుకొచ్చాడు. మాధవ్ తప్పుచేసి సామజిక వర్గాన్ని అడ్డుపెట్టుకోవడం సరికాదని చెప్పుకొచ్చాడు. ఒకవేళ మాధవ్ పై చర్యలు తీసుకొంటే మరికొంతమంది నేతలపై కూడా చర్యలు తీసుకోవాల్సి వస్తుందని, అందుకే జగన్ మౌనంగా ఉన్నారని చెప్పుకొచ్చాడు. ఇక గోరంట్ల మాధవ్ వీడియో తనది కాదు అని చెప్తున్నాడు. అంటే ఆ వీడియోలో ఉన్నది నేనే.. నాదే ఆ వీడియో అంటూ సెటైర్లు వేశాడు. ప్రస్తుతం శివాజీ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి ఈ వ్యాఖ్యలపై గోరంట్ల ఎలా స్పందిస్తాడో చూడాలి.