బద్వేలు ఉప ఎన్నికల్లో అక్కడక్కడా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఉప ఎన్నిక సందర్భంగా పలువురు నేతలు డబ్బు పంచుతున్నారని ఆరోపలు వస్తున్నాయి. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చటు చేసుకుంది. బద్వేలు ఉప ఎన్నికల్లో 103 పోలింగ్ బూత్లలో రిగ్గింగ్ జరుగుతోందని బీజేపీ నేతలు ఆరోపించారు. దీనిపై సీఈసీకి ఫిర్యాదు చేశామని స్థానిక నేతలు తెలిపారు. పలువురు దొంగ ఓటర్ ఐడీలతో వైసీపీ ఓట్లు వేయించిందని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. పోరుమామిళ్ల మండలంలో 58,…
తెలుగు రాష్ట్రాల్లో శనివారం నాడు ఉప ఎన్నికల హడావిడి నెలకొంది. ఏపీలోని బద్వేలు, తెలంగాణలోని హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో శనివారం నాడు ఉప ఎన్నికలు జరగనున్నాయి.ముఖ్యంగా హుజురాబాద్‌లో పోటీ టీఆర్ఎస్, బీజేపీల మధ్య ఉండనుంది. టీఆర్ఎస్ తరఫున గెల్లు శ్రీనివాస్ యాదవ్, బీజేపీ తరఫున ఈటెల రాజేందర్ బరిలో ఉన్నారు. ఇప్పటికే తెలంగాణలో హుజురాబాద్ ఉప ఎన్నిక చాలా కాస్ట్‌లీ అంటూ ప్రచారం జరుగుతోంది. ఈ ఎన్నికలో గెలుపు ఇరుపార్టీలకు చాలా అవసరం. ప్రజల్లో తమపై వ్యతిరేకత…
కడప జిల్లా బద్వేల్ లో భారీ వర్షం కురుస్తోంది.. ఇవాళ వేకువ జాము నుంచి భారీ వర్షం పడుతూనే ఉంది. దీంతో బద్వేల్ పోలింగ్ పై తీవ్ర గందరగోళం నెలకొంది. అయితే… వర్షం లో నైనా పోలింగ్ సామాగ్రిని తీసుకెళుతుంది ఎన్నికల సిబ్బంది. ఎన్నికల సామాగ్రి తడవకుండా ఎన్నికల అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వర్షంలోనైనా… తమ డ్యూటీ ని సక్రమంగా నిర్వహిస్తున్నారు ఎన్నికల అధికారులు. అయితే.. రేపు కూడా వర్షం బాగా పడితే.. పోలింగ్ శాతం తగ్గే…
బద్వేల్ ఉప ఎన్నికలో ఎవరు గెలుస్తారనేది చెప్పడం పెద్ద కష్టమేమీ కాదు. ఈ ఎన్నిక ఉత్కంఠగా జరుగుతుందని అంతా భావించారు. అయితే అందరీ అంచనాలను తలకిందులు చేస్తూ ప్రధాన పార్టీలు పోటీ నుంచి తప్పుకున్నాయి. దీంతో అధికారంలో ఉన్న వైసీపీకి ఇక్కడ గెలుపు నల్లేరుపై నడకలా మారింది. అయితే వైసీపీ మెజార్టీపైనే కన్నేసినట్లు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థికి 44వేల ఓట్ల మెజార్టీరాగా దానిని అధిగమించడమే లక్ష్యంగా ఆపార్టీ శ్రేణులు ముందుకు కదులుతున్నాయి. గత…
బద్వేల్ ఉప ఎన్నికల్లో వింత పరిస్థితి నెలకొంది. వైసీపీకి అంతో ఇంతో పోటీనిచ్చే రెండు పార్టీలు తాజాగా ఈ ఉప ఎన్నిక నుంచి తప్పుకున్నాయి. దీంతో ఈ ఎన్నిక ఏకగ్రీవం అవుతుందని అంతా భావిస్తున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి సైతం ఈ ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు తనవంతు ప్రయత్నం చేస్తున్నారు. అయితే వైసీపీకి ఏమాత్రం పోటీ ఇవ్వలేని పార్టీలు బరిలో నిలుస్తుండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఓడిపోతామని తెల్సినా సదరు పార్టీలు పోటీకి దిగుతుండడం వెనుక మతలబు ఏంటా? అనే…
బద్వేల్ ఉప ఎన్నిక ఏపీ రాజకీయాన్ని మార్చివేయనుందా? అంటే అవుననే సమాధానమే విన్పిస్తోంది. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు.. శాశ్వత శత్రువులు ఉండరు. కానీ ఈ ఉప ఎన్నిక మాత్రం ఏపీలో ఎవరు మిత్రులు.. ఎవరు శత్రువులు అనే దానిపై ప్రజలకు క్లారిటీ ఇవ్వనుంది. బద్వేల్ లో నామినేషన్ల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి రోజురోజుకు కీలక పరిణామాలు చోటుచేసుకుంది. ఒక పార్టీలో బరిలో ఉంటామని ప్రకటిస్తుండగా మరోపార్టీ పోటీ నుంచి తప్పుకుంటున్నామని చెబుతోంది. దీంతో బద్వేల్ రాజకీయం ఒకింత…
సీఎం జగన్ సొంత జిల్లా కడపలో ఉప ఎన్నిక హీట్ పెంచింది. వైసీపీ ఎమ్మెల్యే మృతితో బద్వేల్ లో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ షూరు అయ్యింది. అక్టోబర్ 30న పోలింగ్ జరుగనుంది. నవంబర్ 2న ఫలితాలు వెల్లడికానున్నాయి. దీంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి. వైసీపీ నుంచి మృతిచెందిన ఎమ్మెల్యే భార్యకే అధిష్టానం టికెట్ కేటాయించింది. టీడీపీ సైతం తమ అభ్యర్థిని ప్రకటించి ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఇక జనసేన…