Sajjala Ramakrishna Reddy: ఏపీలో వ్యవస్థలు గాడి తప్పాయి.. ప్రధాని, రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్తాం..!
- ఏపీలో వ్యవస్థలు గాడి తప్పాయి..
- రాష్ట్రంలో ఆర్గనైజ్డ్ క్రైమ్ పెరిగిపోయింది..
- ప్రస్తుత పరిస్థితిని ప్రధాని, రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్తాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sajjala Ramakrishna Reddy: ఏపీలో వ్యవస్థలు గాడి తప్పాయి.. రాష్ట్రంలో జరుగుతోన్న క్రైమ్, ప్రస్తుత పరిస్థితిన ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దృష్టికి తీసుకెళ్తాం అన్నారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి.. పోలీసుల వేధింపులు భరించలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడి చికిత్స పొందుతున్న లక్ష్మీనారాయణ కుటుంబ సభ్యులను గుంటూరు రమేష్ హాస్పిటల్‌లో వైసీపీ నేతలతో కలిసి పరామర్శించనున్న సజ్జల రామకృష్ణారెడ్డి.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చంద్రబాబు నాయకత్వంలో కూటమి ఏర్పాటై ఏడాది అయ్యింది. ఎన్నికలకుముందు మా పాలన డిఫరెంట్ గా ఉంటుందన్నారు. ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు. పోలీసు వ్యవస్థను ప్రైవేటు ఆర్మీలా తయారు చేసి ప్రత్యర్థులపై దాడులు చేస్తున్నారు.. తప్పుడు కేసులు పెడుతున్నారు.. రోజూ పది తప్పుడు కేసులు పెడుతున్నారంటూ విమర్శించారు.
Read Also: BJP New President: నెలాఖరులోగా బీజేపీకి కొత్త జాతీయ అధ్యక్షుడు..!
Also Read
- Mother Murder Case: గుంటూరులో దారుణం.. ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసిన కూతురు..! డబ్బుల కోసమేనా..?
- Guntur Girl Missing Case: పోలీసుల వైఫల్యంపై హైకోర్టు సీరియస్.. డీజీపీ స్వయంగా హాజరు కావాలని ఆదేశం
- Venkaiah Naidu: ‘ఇష్టపడి పని చేయండి.. నష్టపోవడం ఉండదు’.. పట్టభద్రులకు వెంకయ్య సందేశం
- Ambati Rambabu: ఏఐ వీడియో వివాదంలో అంబటి రాంబాబు.. కేసు నమోదు..
అరాచక శక్తులు, గూండాలు చేసే పనులు వీళ్లు చేస్తున్నారు. రాష్ట్రంలో ఆర్గనైజ్డ్ గా క్రైం చేస్తున్నారు. క్రిమినల్ గ్యాంగ్ కు యూనిఫారం వేసినట్లుంది ఈ వ్యవహారం అంటూ సంచలన ఆరోపణలు చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి.. ఇక, లక్ష్మీనారాయణ ఏ పార్టీ అన్నది కాదు.. కులాన్ని తీసుకొచ్చారు. అసలు డీఎస్పీకి సివిల్ మ్యాటర్ లో ఏం పని..? అని ప్రశ్నించారు.. ఫ్రెండ్లీ పోలీస్ మరిచి యాభై ఏళ్లక్రితం ఎమర్జెన్సీకి తీసుకెళ్తున్నారని విమర్శించారు. రక్షించాల్సిన వారే అరాచక శక్తి అయితే ఎవరు ఏం చెయ్యగలరు..? అని ఆవేదన వ్యక్తం చేశారు.. శాతవసహన కాలేజీని అర్ధరాత్రి కూలగొట్టాల్సిన అవసరం ఏంటి..? దీని వెనుక టీడీపీ నేత ఉన్నారన్న ఆయన.. సంఘవిద్రోహక శక్తుల మాదిరిగా ప్రవర్తిస్తున్నారు. నిజాయితీ ఉన్న పోలీసులు లూప్ లైన్ లో ఉన్నారు. వ్యవస్థ గాడి తప్పింది.. అయినా, ఒక్కరిపై చర్యలు లేవు.. పోలీసులే పంచాయతి చేస్తారు… శిక్షలు కూడా వాళ్లే వేస్తారు అంటూ మండిపడ్డారు.
Read Also: Minister Savita: మంత్రి గారికి కోపం వచ్చింది.. బొకే విసిరికొట్టింది..!
మరణవాంగ్మూలం కంటే ఏది ఎక్కువ కాదు.. లక్ష్మీనారాయణ స్వయంగా పోలీసుల వేధింపుల గురించి చెప్పారు.. కృష్ణవేణి, సుధారాణిలను వేధించారు. ఆర్గనైజ్డ్ అరాచకానికి చట్టాన్ని కాపాడే పోలీసులను అడ్డం పెట్టుకున్నారు.. ఇంత కన్నా దిగజారేది లేదు అంటూ ఫైర్ అయ్యారు సజ్జల.. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ లు పరిస్థితి గమనించాలి.. అదుపుతప్పుతున్న వ్యవస్థలు రేపు మరింత డేంజర్ అవుతాయని హెచ్చరించారు. లక్ష్మీనారాయణ ఘటపై జ్యుడీషియల్ విచారణ జరిపించాలి.. తప్పులకు పాల్పడుతున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.. తప్పుడు కేసులు, వేధింపులపై కోర్టులు, మానవ హక్కుల సంఘం దృష్టికి తీసుకెళ్తాం అన్నారు.. ఇక, ప్రధాని మోడీ, రాష్ట్రపతి దృష్టికి రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలు తీసుకెళ్తాం అన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి..
తాజావార్తలు
-
Yogi Adityanath: హమీద్ అన్సారీ ‘హిందూ’ వ్యాఖ్యలపై యోగి ఘాటు కౌంటర్
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
-
Komatireddy Venkat Reddy : కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలి.. మంత్రి కోమటిరెడ్డి హాట్ కామెంట్స్..
-
Asaduddin Owaisi: ‘బీజేపీని ఆపాలంటే మాతో మాట్లాడండి’.. యూపీలో ఓవైసీ ఆఫర్..
-
Team India: టీమిండియాకు బిగ్ షాక్.. శుభమన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా దూరం.. కారణం ఇదే..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!