Ambati Rambabu: పోలీసులను రాజకీయ కక్షకు వాడుతున్నారు.. అంబటి రాంబాబు సంచలన ఆరోపణలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ambati Rambabu: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పోలీసు యంత్రాంగాన్ని రాజకీయ కక్ష సాధింపుకు ఉపయోగిస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. వైసీపీ నేతలతో పాటు సోషల్ మీడియా యాక్టివిస్టులు, రాజకీయ విశ్లేషకులను లక్ష్యంగా చేసుకుని కేసులు నమోదు చేస్తూ అరెస్టులు చేస్తున్నారని విమర్శించారు. అంబటి రాంబాబు మాట్లాడుతూ, కేవీఆర్ అరెస్టు విషయంలో చట్టపరమైన విధానాలను పాటించలేదని అన్నారు. ఈ వ్యవహారంలో తెలంగాణ పోలీసులు కూడా ఏపీ పోలీసులపై కేసు నమోదు చేశారని గుర్తుచేశారు. కేవీఆర్, ప్రశ్న రావణ్‌లకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
తప్పు మాట్లాడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడంలో అభ్యంతరం లేదని, అయితే వారు మాట్లాడిన అంశాలకు మించి తీవ్రమైన కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు అంబటి.. ప్రశ్న రావణ్ కేసులో పిఠాపురం కోర్టు ఆయనకు ఉపశమనం కల్పించిందని, పలుమార్లు కోర్టులు అనుకూలంగా తీర్పులు ఇచ్చినా ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవడం లేదని విమర్శించారు. ప్రశ్న రావణ్‌ను చంపే ప్రయత్నం జరిగిందని అంబటి రాంబాబు ఆరోపించారు. రావణ్ తమ పార్టీకి చెందిన వ్యక్తి కాదని, ఆయన ఒక యూట్యూబర్ మాత్రమేనని పేర్కొన్నారు. అయినప్పటికీ ఆయనపై తప్పుడు కేసులు నమోదు చేసి, యూఏపీఏ వంటి కఠిన చట్టాలను ప్రయోగించడం దుర్వినియోగమని విమర్శించారు.
Also Read
- Mother Murder Case: గుంటూరులో దారుణం.. ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసిన కూతురు..! డబ్బుల కోసమేనా..?
- Guntur Girl Missing Case: పోలీసుల వైఫల్యంపై హైకోర్టు సీరియస్.. డీజీపీ స్వయంగా హాజరు కావాలని ఆదేశం
- Venkaiah Naidu: ‘ఇష్టపడి పని చేయండి.. నష్టపోవడం ఉండదు’.. పట్టభద్రులకు వెంకయ్య సందేశం
- Ambati Rambabu: ఏఐ వీడియో వివాదంలో అంబటి రాంబాబు.. కేసు నమోదు..
రావణ్‌కు వైసీపీ తరఫున న్యాయ సహాయం అందిస్తామని అంబటి రాంబాబు తెలిపారు. రాష్ట్రంలో సోషల్ మీడియాపై చట్టవిరుద్ధంగా దౌర్జన్యకాండ కొనసాగుతోందని ఆరోపిస్తూ, ప్రభుత్వ విధానాలను తీవ్రంగా ఖండించారు. మరోవైపు, ఇతర సోషల్ మీడియా వ్యక్తులు అసభ్య పదజాలంతో మాట్లాడుతున్నప్పటికీ వారిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు..
తాజావార్తలు
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Botsa Satyanarayana: ‘రూ.వెయ్యి, రూ.10 వేల పరిహారం కాదు’.. పంట నష్టంపై బొత్స కీలక డిమాండ్లు..
-
Slum Dog Glimpse: అమ్మ ఉన్నది అన్నం పెట్టడానికి, అడుక్కోవడానికి కాదు.. కన్నీళ్లు పెట్టిస్తున్న ‘స్లమ్ డాగ్’ గ్లింప్స్!
-
Trump Iran Statement: ‘త్వరలోనే విజయం సాధిస్తాం’.. ఇరాన్‌తో ఘర్షణపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
-
Guest Habits: గెస్ట్‌గా వెళ్తున్నారా? పిలిచినవారు ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఇలా చేయండి..!
ట్రెండింగ్
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!