RAAKA: ‘రాకా’లో తెలుగు బ్యూటీ ఎంట్రీ…. అల్లు అర్జున్ సినిమాతో సిరి హనుమంతుకు బిగ్ బ్రేక్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RAAKA: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’పై ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ మూవీ నుంచి వస్తున్న ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి మరో ఆసక్తికరమైన అప్డేట్ వార్తల్లో నిలుస్తోంది. తెలుగు నటి సిరి హనుమంతు ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నట్లు అధికారికంగా వెల్లడైంది. దీంతో ఆమె కెరీర్లో ఇది పెద్ద మలుపుగా మారనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత ఎస్.కె.ఎన్ ఈ విషయాన్ని వెల్లడించారు. అల్లు అర్జున్ నటిస్తున్న ‘రాకా’లో సిరి హనుమంతు భాగమవుతున్నట్లు ఆయన ప్రకటించారు. అయితే ఆమె పోషిస్తున్న పాత్రకు సంబంధించిన వివరాలను మాత్రం చిత్రబృందం గోప్యంగా ఉంచుతోంది. కథలో ఆమె పాత్రకు ప్రాధాన్యం ఉండటంతోనే ప్రస్తుతం ఎలాంటి వివరాలు బయటకు రానివ్వడం లేదని తెలుస్తోంది.
సిరి హనుమంతు చివరిసారిగా ‘సీత పయనం’ మూవీలో కనిపించారు. అలాగే త్వరలో విడుదల కానున్న ‘చెన్నై లవ్ స్టోరీ’లో కూడా ఆమె నటిస్తున్నారు. అయితే స్టార్ హీరో అల్లు అర్జున్ సరసన అట్లీ వంటి స్టార్ దర్శకుడి సినిమాలో అవకాశం రావడం ఆమె కెరీర్‌కు పెద్ద బూస్ట్‌గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. బుల్లి తెర, డిజిటల్ వేదికల ద్వారా గుర్తింపు తెచ్చుకున్న సిరి ఇప్పుడు పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో చోటు దక్కించుకోవడం విశేషం. ప్రస్తుతం ‘రాకా’ షూటింగ్ ముంబైలో శరవేగంగా కొనసాగుతోంది. ఈ సినిమాకు సంబంధించి అధికారికంగా ప్రకటించిన హీరోయిన్ దీపికా పడుకోన్ మాత్రమే. ఆమెతో పాటు మరికొందరు ప్రముఖ నటీనటులు కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారని ప్రచారం జరుగుతున్నప్పటికీ, చిత్రబృందం ఇంకా పూర్తి తారాగణాన్ని వెల్లడించలేదు.
Also Read
- Vrushakarma : నాగవంశీ అవుట్.. దిల్ రాజు ఇన్..'వృషకర్మ' వెనుక అసలేం జరిగింది?
- Varanasi Update: ‘వారణాసి’ నుంచి మరో బిగ్ ట్రీట్.. మళ్లీ అప్పుడే ప్లాన్ చేశారా?
- Sigma OTT: అప్పుడే ఓటీటీలోకి ‘సిగ్మా’.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
- Ahaan Panday: 10 కథలు రిజక్ట్ చేసిన యువ హీరో.. చివరకు ఆ డైరెక్టర్‌కు గ్రీన్ సిగ్నల్!
సన్ పిక్చర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్కు సంగీత దర్శకుడు సాయి అభ్యంక్కర్ సంగీతం అందిస్తున్నారు. అట్లీ మార్క్ కమర్షియల్ ఎలిమెంట్స్, అల్లు అర్జున్ స్టైలిష్ స్క్రీన్ ప్రెజెన్స్, భారీ విజువల్స్‌తో ఈ సినిమా భారతీయ చిత్రసీమలో మరో భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలుస్తుందనే అంచనాలు ఇప్పటికే మొదలయ్యాయి. 2027 చివర్లో ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుండగా, అప్పటి వరకు ప్రతి అప్డేట్ అభిమానుల్లో మరింత బజ్ ను పెంచడం ఖాయంగా కనిపిస్తోంది.
- Tags
- cinema
- Raaka
- siri hanumanth
తాజావార్తలు
-
Shehbaz Sharif: “కాశ్మీరీలను భారత్ అణచివేస్తోంది”.. పాక్ ప్రధాని ఆరోపణలు.!
-
Bengaluru Employee: జీతం ఎక్కువైందని రాజీనామా కోరుతున్న బాస్.. ఉద్యోగి పోస్ట్ వైరల్..
-
Arnab Cyclone Effect : అర్నబ్ బీభత్సం.. అనకాపల్లి తీరంలో భయానక పరిస్థితులు.!
-
Perni Nani: చంద్రబాబు, పవన్, మాధవ్.. మీకు ఎందుకు ఓట్లు వేయాలి? పేర్ని నాని ప్రశ్నల వర్షం
-
Invest Telangana Summit : ఇన్వెస్ట్ తెలంగాణ సదస్సులో క్లైమేట్ ఛేంజ్‌పై ప్రత్యేక చర్చ
ట్రెండింగ్
-
Karwa Chauth 2026 : కర్వా చౌత్ 2026.. తేదీ, పూజా ముహూర్తం ఇదే.!
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!
-
Ducati Formula 73 లిమిటెడ్ ఎడిషన్ బైక్ లాంచ్.. అప్పుడే అన్నీ సోల్డ్ ఔట్..!
-
IND vs NZ: హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా బరిలోకి భారత్.. మూడో స్థానంలోనే వైభవ్ సూర్యవంశీకి అవకాశం..!