ఏపీలో వ్యవస్థలు గాడి తప్పాయి.. రాష్ట్రంలో జరుగుతోన్న క్రైమ్, ప్రస్తుత పరిస్థితిని ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దృష్టికి తీసుకెళ్తాం అన్నారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి.. పోలీసుల వేధింపులు భరించలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడి చికిత్స పొందుతున్న లక్ష్మీనారాయణ కుటుంబ సభ్యులను గుంటూరు రమేష్ హాస్పిటల్‌లో వైసీపీ నేతలతో కలిసి పరామర్శించనున్న సజ్జల రామకృష్ణారెడ్డి.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చంద్రబాబు నాయకత్వంలో కూటమి ఏర్పాటై ఏడాది అయ్యింది.