Guntur SP Satish: పల్నాడు జిల్లాలో మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన రోజున గుంటూరు శివారులో ప్రమాదం జరిగింది అని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. సింగయ్య అనే వ్యక్తి మృతి చెందారు.. జగన్ కారు కింద పడి సింగయ్య మృతి చెందారు అని పేర్కొన్నారు. జగన్ కారు టైరు కిందపడినట్లు వీడియో లభించింది.. 106 సబ్ క్లాజ్ 1 బీఎన్ఎస్ సెక్షన్ ను, 105 బీఎన్ఎస్ కింద ఎలాంగ్ విత్ 49 బీఎన్ఎస్ కింద మార్చడం జరిగింది అని ఎస్పీ సతీష్ చెప్పుకొచ్చారు.
Read Also: T20 World Cup 2026 Canada: T20 ప్రపంచకప్ 2026కు అర్హత పొందిన కెనడా..!
ఇక, ఈఘటనపై మరింత లోతుగా విచారణ చేస్తామని గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. అయితే, ఈ సంఘటన జరిగిన రోజు ఉన్న సమాచారం ఆ రోజు చెప్పారు. కాగా, ఈ ఘటన జరిగిన సమయంలో కారులో ప్రయాణించారు.
1) రమణా రెడ్డి (కారు డ్రైవర్)
2) వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు (మాజీ ముఖ్యమంత్రి)
3) కే.నాగేశ్వర్ రెడ్డి (పీఏ)
4) వైవీ సుబ్బారెడ్డి (మాజీ ఎంపీ)
5) పేర్ని. నాని@వెంకటేశ్వరరావు (మాజీ ఎమ్మెల్యే)
6) విడదల. రజిని (మాజీ మంత్రి) మొదలగు వారిపై చట్ట పరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని ఎస్పీ సతీష్ తెలిపారు.