T20 World Cup 2026 Canada: భారతదేశం, శ్రీలంక సంయుక్తంగా నిర్వహించనున్న పురుషుల టీ20 ప్రపంచకప్ 2026కు కెనడా జట్టు అర్హత సాధించింది. ఒంటారియోలో జరిగిన అమెరికాస్ రీజినల్ క్వాలిఫయింగ్ ఫైనల్స్ లో బహామాస్ ను ఏడు వికెట్ల తేడాతో ఓడించి కెనడా ఈ ఘనత సాధించింది. కెనడా, బర్ముడా, కేమన్ ఐలాండ్స్, బహామాస్ నాలుగు జట్ల మధ్య జరిగిన ఈ టోర్నమెంట్‌లో కెనడా తమ ఐదో వరుస విజయాన్ని నమోదు చేసుకుంది. మిగిలిన రెండు మ్యాచ్‌ల ఫలితాలపై ఆధారపడకుండా.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని దక్కించుకుంది.
Read Also:Operation Midnight Hammer: ఫోర్డో అణు కేంద్రంపై అమెరికా విధ్వంసం.. శాటిలైట్ చిత్రాలు వెలుగులోకి
కెనడా 2024 టీ20 ప్రపంచకప్‌కు కూడా అర్హత పొందిన సంగతి తెలిసిందే. ఇప్పుడు 2026 టోర్నమెంట్‌లో కూడా హాజరు కానుంది. ఇప్పటికే ఈ మెగా టోర్నీకి ఆతిథ్య జట్లు భారత్, శ్రీలంకలతో పాటు అఫ్ఘానిస్తాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, ఐర్లాండ్, న్యూజిలాండ్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, అమెరికా (USA), వెస్టిండీస్ జట్లు అర్హత పొందాయి.ఇక ఈ టోర్నీకి మిగిలిన ఏడు జట్లు యూరోప్ నుండి రెండు, ఆఫ్రికా నుండి రెండు, ఆసియా-ఈఏపీ నుండి మూడు జట్లు క్వాలిఫయింగ్ ద్వారా ఎంపిక కానున్నాయి.
Read Also:Brahmaji: అరె భాయ్ అదంతా జోక్.. మంచు విష్ణు 7000 ఎకరాలపై బ్రహ్మాజీ సంచలన పోస్ట్..!
కెనడాకు బహామాస్‌పై జరిగిన చివరి గేమ్‌లో, కెనడా బౌలర్లు ప్రత్యర్థిని 19.5 ఓవర్లలో కేవలం 57 పరుగులకే ఆలౌట్ చేశారు. ఇందులో కలీమ్ సనా 4 ఓవర్లలో 6 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీయగా, అంష్ పటేల్ 4 ఓవర్లలో 7 పరుగులు ఇచ్చి 2 వికెట్లు, శివం శర్మ 2.5 ఓవర్లలో 16 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసి మెరిశారు. ఆ తర్వాత టార్గెట్ ను చేధించడానికి వచ్చిన కెనడా బ్యాట్స్‌మెన్ ఆ టార్గెట్‌ను కేవలం 5.3 ఓవర్లలో ఛేదించారు. దిల్ప్రీత్ బజ్వా 14 బంతుల్లో 36 పరుగులతో అజేయంగా నిలిచారు. కెనడా చివరి మ్యాచ్ ఆదివారం బర్ముడాతో జరగనుంది.