YCP Leaders House Arrest: గుంటూరు జిల్లాలో హైటెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. టీడీపీ నేతల జంట హత్యల కేసులో మాచర్ల కోర్టులో లొంగిపోనున్నారు మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, సోదరుడు వెంకట్రామిరెడ్డి. కాగా, జంట హత్యల కేసులో సుప్రీంకోర్టు నవంబర్ 28వ తేదీన ముందస్తు బెయిల్ రద్దు చేయడంతో పాటు లొంగిపోయేందుకు రెండు వారాల గడువు ఇచ్చింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు ముగియనుండడంతో పిన్నెల్లి బ్రదర్స్ లొంగిపోతుండటంతో పోలీసులు అలర్ట్ అయ్యారు.
Read Also: Gold Rates: గోల్డ్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం ధరలు.. సిల్వర్ హడల్
ఇక, ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా వైసీపీ నేతలను హౌస్ అరెస్టులు చేస్తున్నారు. ఇక, మాచర్లలో 144 సెక్షన్, పోలీస్ 30 యాక్ట్ అమలులో ఉందని తెలిపారు. కాగా, వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడికు సైతం పోలీసులు నోటీసులు ఇచ్చారు. అలాగే, తెనాలి మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ నోటీసులు తీసుకునేందుకు నిరాకరించి కారులో మాచర్లకు బయలుదేరారు. ఇక, మాజీ మంత్రి విడదల రజిని ఇంటి దగ్గర భారీగా పోలీసులు మోహరించారు.