CM Japan Tour: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనలో భాగంగా ఏప్రిల్ 18 (శుక్రవారం)న టోక్యో నగరాన్ని సందర్శిస్తున్నారు. రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులు, సాంకేతికతను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ పర్యటనను సీఎం చేపట్టారు. ఈ పర్యటనలో ఆయన పలువురు పారిశ్రామికవేత్తలు, జపాన్ ప్రభుత్వ ప్రతినిధులతో సమావేశమై, తెలంగాణలో పెట్టుబడులకు అవకాశాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై చర్చించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి టోక్యో పర్యటనను గాంధీ విగ్రహానికి పుష్పాంజలి సమర్పిస్తూ ప్రారంభించనున్నారు. అనంతరం టోక్యో గవర్నర్‌ను…