CM Chandrababu: గంజాయి, డ్రగ్స్‌పై యుద్ధం ప్రకటిస్తున్నా.. ఎవరైనా అడ్డొస్తే తొక్కుకుంటూ పోవడమే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు.. గుంటూరులో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఈ రోజు మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం.. నేను యువతకు ఒకటే చెబుతున్నా. ఎన్నికలకు ముందు కూడా చెప్పాను. రౌడీల తోక కత్తిరిస్తానని అన్నాను. రాయలసీమలో ముఠా కక్షలు. కుటుంబాలకు కుటుంబాలను చంపే పరిస్థితి. రాయలసీమలో ముఠాకక్షలను పూర్తిగా అణిచివేశాం. మతసామరస్యాన్ని కాపాడుతాం… విద్వేషాలు రెచ్చగొట్టే వారిని వదిలిపెట్టం అని హెచ్చరించారు.. రౌడీయిజాన్ని కంట్రోల్ చేశాం. గంజాయి, డ్రగ్స్ కు బానిస అయితే ఎంతో ప్రమాదం. వారిని బాగు చేయడం కష్టం.. డ్రగ్స్, గంజాయికి రాష్ట్రం కేంద్రంగా మారిందని టీడీపీ ఎన్నోసార్లు చెప్పింది. ఏజెన్సీని గంజాయికి అడ్డాగా మార్చారు అని విమర్శించారు..
Read Also: Atal Pension Yojana: ఈ పథకం అద్భుతం.. భార్యాభర్తలిద్దరు ప్రతి నెల రూ. 10 వేలు పొందే ఛాన్స్
గత ప్రభుత్వం పదిలక్షలకోట్లు అప్పు చేశారు. ఎన్ని కష్టాలు ఎదురైనా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం అన్నారు చంద్రబాబు.. గంజాయి, డ్రగ్స్ పై యుద్దం ప్రకటిస్తున్నా.. ఎవరైనా అడ్డువస్తే తొక్కుకుంటూ పోవడమే.. పోలీసులపై దాడిచేసిన గంజాయి బ్యాచ్ కు సహకరిస్తే ఏమనాలి..? .. వారిని వదిలిపెట్టాలా.? రాజకీయ ముసుగు వేసుకుంటే వదిలిపెట్టాలా..? రాజకీయాలంటే తమాషా కాదు అని హితవు చెప్పారు.. గంజాయి, డ్రగ్స్ నిర్మూలన అందరి బాధ్యతన్న సీఎం.. 2021లో దేశంలో యాభైశాతం గంజాయి ఏజెన్సీ, ఒడిషాలోనే పండించారు. గంజాయి వాడకంతో శక్తహీనులవుతారు.. వారు చాలా ప్రమాదకరంగా మారుతారు. సమాజానికి, తల్లిదండ్రులకు సమస్య వస్తుంది.. మత్తులో ఉండే వ్యక్తి తల్లి, చెల్లి, పిల్లలపై దాడులకు దిగుతున్నారు. మూడేళ్ల చిన్నారిపై అత్యాచారం చేశారంటే వీరు మనుషులేనా? అని ఆవేదన వ్యక్తం చేశారు.. ఏజెన్సీలో గంజాయి పెంచకుండా కఠినమైన చర్యలు చేపట్టాం. మామూలు షాపులు గంజాయి అమ్ముతున్నారు. కొన్ని మెడికల్ షాపులలో గంజాయి అమ్ముతున్నారు. మారితే మారండి… లేకపోతే మీరు రాష్ట్రంలో ఉండడానికి అర్హతలేదు అని హెచ్చరించారు చంద్రబాబు.
Read Also: IND vs ENG: ఎడ్జ్ బాస్టన్ టెస్ట్ కు ఇంగ్లాండ్ జట్టు ప్రకటన.. 4 ఏళ్ల తర్వాత ఆ బౌలర్ కు జట్టులో చోటు
ఆడబిడ్డపై దాడికి పాల్పడితే అదే చివరిరోజు అని వార్నింగ్ ఇచ్చారు ఏపీ సీఎం.. 26 జిల్లాల్లో నార్కొటిక్ సెల్స్ ఏర్పాటు చేశాం. కాలేజీలలో ఈగల్ క్లబ్బులు ఏర్పాటు చేశాం.. నేను గంజాయి నిర్మూలనకు కృషి చేస్తా.. మీరు సహకరించండి అని పిలుపునిచ్చారు.. 1972కు రింగ్ చేయండి.. మీ పేరు కూడా బయటకు రానివ్వం.. కేసులతో గంజాయి సమస్య పరిష్కారం కాదు.. ఆస్తులు కూడా జప్తు చేస్తున్నాం అన్నారు.. గంజాయి అమ్మినవారి ఆస్తులు కూడా స్వాధీనం చేసుకుంటాం. సినిమావారికి కూడా చెబుతున్నా. సెలబ్రిటీలు ముందుకురావాలని సూచించారు.. 56డీ ఎడిక్షన్ సెంటర్లు పెడుతున్నాం.. మూడు ప్రాంతాలలో వరల్డ్ క్లాస్ డీ ఎడిక్షన్ సెంటర్లు పెడతాం. కోదాడలో తల్లి చెబుతున్నా వినకపోతే చెట్టుకు కట్టేసి చెప్పడం చూస్తే బాదేసింది. తెలివితేటలతో పనిచేస్తే ఆకాశమే హద్దుగా అభివృద్ధి సాధ్యం.. అమరావతిలో క్వాంటం వ్యాలీ. ఏఐ గురించి మాట్లాడుతున్నారు.. ఈరోజునుంచి ఒకటే హెచ్చరిస్తున్నా. బయటనుండి గంజాయి తీసుకొచ్చి అమ్మినా ఊరుకోం. ప్రజలు కూడా పోలీసింగ్ చెయ్యాలి.. రాత్రి సమయాల్లో డ్రోన్స్ ద్వారా పర్యవేక్షణ చేస్తున్నాం. పవన్ కళ్యాణ్, బీజేపీతో కలిసి హామీ ఇచ్చాం. 94శాతం స్ట్రైక్ రేట్ ఇచ్చారు. నాజీవితంలో ఇలాంటి విజయం చూడలేదని పేర్కొన్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు..