గంజాయి, డ్రగ్స్‌పై యుద్ధం ప్రకటిస్తున్నా.. ఎవరైనా అడ్డొస్తే తొక్కుకుంటూ పోవడమే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు.. గుంటూరులో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఈ రోజు మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం.. నేను యువతకు ఒకటే చెబుతున్నా. ఎన్నికలకు ముందు కూడా చెప్పాను. రౌడీల తోక కత్తిరిస్తానని అన్నాను. రాయలసీమలో ముఠా కక్షలు. కుటుంబాలకు కుటుంబాలను చంపే పరిస్థితి. రాయలసీమలో ముఠాకక్షలను పూర్తిగా అణిచివేశాం. మతసామరస్యాన్ని కాపాడుతాం... విద్వేషాలు రెచ్చగొట్టే…