టాలీవుడ్ యంగ్ హీరో సిద్దూ జొన్నలగడ్డ నటిస్తున్న తాజా చిత్రం ‘జాక్’. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ట్రైలర్ బాగానే ఆకట్టుకున్నప్పటికి.. ఆ డైలాగ్ డెలివరీ, స్టైల్ మేకింగ్ చూస్తుంటే ఎక్కడా కూడా బొమ్మరిల్లు భాస్కర్ మార్క్ అయితే కనిపించలేదని చెప్పాలి. అంతా సిద్దూనే డైరెక్ట్ చేసినట్టు ఉందని కామెంట్లు కూడా వినబడ్డాయి. మరి సినిమాలో ఎలా ఉంటుందో.. బొమ్మరిల్లు భాస్కర్ మార్క్ కనిపిస్తుందో లేదో చూడాలి. ఇక విడుదల సమయం దగ్గరపడుతుండటంతో మూవీని ప్రమోట్ చేసుకునే బిజీలో ఉన్నాడు సిద్దు. ఇందులో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ మూవీలో నటిస్తున్న హీరోయిన్ వైష్ణవి చైతన్య గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.
Also Read: Kareena kapoor : వారానికి ఐదు సార్లు దాని తినాల్సిందే ..
‘ ‘జాక్’ మూవీ మీకు కచ్చితంగా నచ్చుతుంది. కొత్త సిద్దు ని చూస్తారు. కానీ మ్యూజిక్ పట్ల అసంతృప్తిగానే ఉన్న. ఓ చార్ట్ బస్టర్ సాంగ్ అయితే రాలేదు. వచ్చిన రెండు పాటలకు కూడా డీసెంట్ రెస్పాన్స్ వచ్చింది. ఓ బ్లాక్ బస్టర్ సాంగ్ పడి ఉంటే బాగుండేదనే ఫీలింగ్, అసంతృప్తి ఉంది. ఇక వైష్ణవి చాలా స్ట్రాంగ్ ప్రమోషన్స్‌లో ఎవరైనా ఏదైనా అడిగితే నేను కాస్త ఆలోచించి సమాధానం ఇస్తాను. కానీ వైష్ణవి మాత్రం టక్కుమని ఆన్సర్ చేస్తుంది. ఆ స్ట్రాంగ్ నెస్ ఉండాలి. వైష్ణవి ఎమోషనల్లీ చాలా స్ట్రాంగ్ అదే తనలో నాకు బాగా నచ్చుతుంది’ అని సిద్దూ జొన్నలగడ్డ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ జంట జాక్‌ను ప్రమోట్ చేసుకునే పనిలో ఉంది.