Guntur Girl Missing Case: పోలీసుల వైఫల్యంపై హైకోర్టు సీరియస్.. డీజీపీ స్వయంగా హాజరు కావాలని ఆదేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Guntur Girl Missing Case: మరోసారి ఆంధ్రప్రదేశ్ పోలీసులపై సీరియస్ అయ్యింది హైకోర్టు.. గుంటూరులో పదో తరగతి చదువుతున్న బాలిక అదృశ్యమైన ఘటనపై విచారణ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బాలిక అదృశ్యమై ఇప్పటికే 80 రోజులు గడిచినా ఆమె ఆచూకీ కనుగొనలేకపోవడంపై ధర్మాసనం పోలీసు శాఖను, ప్రభుత్వాన్ని నిలదీసింది. కేసు విచారణ సందర్భంగా నిన్న హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అదృశ్యమైన బాలికను ఇవాళ తమ ముందు హాజరుపరచాలని డీజీపీని ఆదేశించింది. అయితే, ఇవాళ విచారణకు బాలికను ధర్మాసనం ముందు హాజరుపరచడంలో పోలీసులు విఫలమయ్యారు. దీంతో “డీజీపీకి మేము ఇచ్చిన ఆదేశాలు అర్థమవుతున్నాయా లేదా?” అంటూ ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.
బాలిక ఆచూకీ కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేశామని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. దీనిపై స్పందించిన ధర్మాసనం.. సిట్ ఏర్పాటు చేశారంటే గుంటూరు పట్టాభిపురం పోలీసులు బాలిక ఆచూకీ కనుగొనడంలో విఫలమైనట్లేనా అని ప్రశ్నించింది. ఆచూకీ కనిపెట్టడంలో విఫలమైన అధికారులనే సిట్‌లో నియమిస్తే ప్రయోజనం ఏమిటని ప్రభుత్వాన్ని నిలదీసింది. బాలిక ఆచూకీ కోసం ఏర్పాటు చేసిన సిట్‌లో మొత్తం తొమ్మిది మంది అధికారులు ఉండగా, వారిలో ఏడుగురు ఇప్పటికే బాలిక ఆచూకీ కనుగొనడంలో విఫలమైన అధికారులేనని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దర్యాప్తులో విఫలమైన అధికారులకే మళ్లీ బాధ్యతలు అప్పగించడం సరైన విధానం కాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
Also Read
- CM Chandrababu: బీసీ రిజర్వేషన్లను వైసీపీ అడ్డుకుంది..! సుప్రీంకోర్టుకు వెళ్తాం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- Guntur Car Fire: కారులో ఏసీ పేలి మంటలు.. తండ్రి సజీవదహనం, కొడుకుకు తీవ్ర గాయాలు..
- Mother Murder Case: గుంటూరులో దారుణం.. ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసిన కూతురు..! డబ్బుల కోసమేనా..?
- Venkaiah Naidu: ‘ఇష్టపడి పని చేయండి.. నష్టపోవడం ఉండదు’.. పట్టభద్రులకు వెంకయ్య సందేశం
“పోలీస్ డిపార్ట్మెంట్లో ఎవరి పని వాళ్లు సక్రమంగా చేస్తే ప్రజలు ఎందుకు కోర్టును ఆశ్రయిస్తారు?” అని హైకోర్టు ప్రశ్నించింది. పోలీసులు సక్రమంగా పనిచేయకపోవడం వల్లే బాధితులు, వారి కుటుంబాలు న్యాయం కోసం కోర్టును ఆశ్రయించాల్సి వస్తోందని ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. బాలికను సోమవారం వరకు హైకోర్టు ముందు హాజరుపరిచేందుకు సమయం కావాలని ప్రభుత్వం కోరింది. సోమవారం నాటికి అదృశ్యమైన బాలికను కోర్టు ముందు హాజరుపరుస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. దీంతో సోమవారం డీజీపీ స్వయంగా హైకోర్టుకు హాజరు కావాలని ధర్మాసనం ఆదేశించింది.
ఇప్పటికే బాలిక అదృశ్యమై 80 రోజులు గడిచినా ఆచూకీ కనుగొనలేకపోయిన అధికారులపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది. కంటి తుడుపు చర్యలు చేపట్టవద్దని పోలీసులను గట్టిగా హెచ్చరించింది. బాలిక అసలు ఎక్కడ ఉంది? ఆమె సురక్షితంగా ఉందా లేదా? అనే విషయాలపై తల్లిదండ్రులకు ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందని ధర్మాసనం ప్రశ్నించింది. బాలిక ఆచూకీని వెంటనే కనుగొని, దర్యాప్తులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది. సోమవారం విచారణలో ప్రభుత్వం, డీజీపీ ఇచ్చే సమాధానాలు కీలకంగా మారనున్నాయి.
తాజావార్తలు
-
Thaman : తెలుగులో థమన్ బ్యాక్ ఆన్ ట్రాక్
-
BC Reservations: సర్కార్ కీలక ఉత్తర్వులు.. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్..!
-
RT 78 : జెట్ స్పీడ్‌లో రవితేజ.. వివేక్ ఆత్రేయ సినిమా స్టార్ట్
-
CJP Leaders Released: సీజేపీ నాయకులకు బిగ్ రిలీఫ్.. అభిజీత్, సౌరవ్, అశుతోష్, ధృవ్ రాఠీ విడుదల..
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
ట్రెండింగ్
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..