విశాఖ జిల్లాలో విషవాయువు లీకేజ్ కలవరం కలిగించింది. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం పారిశ్రామికవాడ (సెజ్)లో మంగళవారం మరోమారు విషవాయువు లీకేజీ (Gas Leakage) కలకలం రేపింది. వస్త్ర కంపెనీలో విష వాయువు లీకైనట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో పలువురు మహిళలు అస్వస్థతకు గురయ్యారు. విషవాయువుతో ఇబ్బందులు పడిన మహిళలను అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించినట్టు పోలీసులు తెలిపారు.
Monkeypox: కలవరపెడుతోన్న మంకీపాక్స్.. టెన్షన్‌పెడుతోన్న కొత్త కేసులు
ఇదే సెజ్‌లో రెండు నెలల కిందట గ్యాస్ లీకైన సంగతి తెలిసిందే. మళ్లీ విషవాయువులు వెలువడటంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. పరిశ్రమలో భద్రతా ప్రమాణాలు పాటించడం లేదని కార్మికులు మండిపడుతున్నారు. ఇదిలా వుంటే.. మంత్రి గుడివాడ అమర్నాథ్ ఈ ఘటనపై స్పందించారు. అచ్యుతా పురం విషవాయువు లీకేజీపై అధికారులతో మాట్లాడారు మంత్రి గుడివాడ అమర్నాథ్. బాధితులకు మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
విశాఖ కాదు విషాద పట్నం.. లోకేష్
మరోవైపు సీఎం జగన్ విశాఖపట్నాన్ని విషాదపట్నంగా మార్చేశారని మండిపడ్డారు టీడీపీ నేత నారా లోకేష్. విశాఖలో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడడంలేదు.రెండు నెలల వ్యవధిలోనే రెండుసార్లు గ్యాస్ లీకేజ్ ఘటనలు జరిగాయంటే ప్రజల ప్రాణాల పట్ల ప్రభుత్వ లెక్క లేనితనం స్పష్టమవుతోంది.విశాఖపట్టణంలో జే గ్యాంగ్ కబ్జాలు, దౌర్జన్యాలు, ప్రమాదాలు, విష రసాయనాల లీకులతో ప్రజలు తమ ప్రాణాలు అరచేతిలో పట్టుకుని బతుకుతున్నారు.
ఎల్జీ పాలీమర్స్ మరణ మృదంగం, సాయినార్ ఫార్మా విషాదం మరువకముందే, అచ్యుతాపురం సెజ్ సీడ్స్ కంపెనీలో రెండోసారి విషవాయువులు లీకై వందలమంది మహిళలు తీవ్ర అస్వస్థతకి గురి కావడం తీవ్ర ఆందోళన కలిగించింది.ఉపాధి కోసం వచ్చిన మహిళల ప్రాణాలు పోయినా ఫర్వాలేదు.. కమీషన్లు నెలనెలా అందితే చాలన్నట్టుంది జగన్ పరిపాలన.చనిపోయాక పరిహారం ఇవ్వడం కాదు సీఎం గారూ! వాళ్లు బతికేలా రక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు నారా లోకేష్.
సోము వీర్రాజు ఏమన్నారంటే…
అనకాపల్లి బ్రాండిక్స్ కంపెనీలో రసాయన వాయువు లీక్ తో అస్వస్థతకు గురైన మహిళలకు వేగంగా వైద్యం అందించాలి. రెండు నెలల వ్యవధిలో రెండు పర్యాయాలు రసాయనాలు లీక్ కావడమేంటీ..? ప్రభుత్వం తోలు మందంగా వ్యవహరిస్తోంది. పరిశ్రమలపై ప్రభుత్వం పర్యవేక్షణ విరమించుకుందా..? కార్మికులు అస్వస్థతకు గురైతే ప్రభుత్వం ఏం చేస్తోంది? స్థానిక కార్యకర్తలు కార్మికులకు అండగా ఉండాలన్నారు బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.
CM JaganmohanReddy: జగన్‌ని కలిసిన టెక్ మహీంద్ర ఎండీ, సీఈవో