అమరావతిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (YS Jaganmohan Reddy) ని కలిశారు టెక్ మహేంద్ర (tech mahindra) ఎండీ, సీఈవో సీపీ గుర్నాని. ఈ మేరకు ముందుగా సీఎం జగన్‌ను సత్కరించిన గుర్నానీ.. ఆపై ఆయనకు జ్ఞాపికను బహుకరించారు. అనంతరం గుర్నానీని సీఎం జగన్ సత్కరించి జ్ఞాపికను అందజేశారు. దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో సీఎం వైఎస్ జగన్‌ను కలిశారు. ఏపీలో టెక్ మహీంద్ర కార్యకలాపాలు, విస్తరణ గురించి చర్చించిన సీపీ. గుర్నాని వాటికి కొనసాగింపుగా ఇవాళ భేటీ అయ్యారు.
CWG 2022: వెయిట్ లిఫ్టింగ్‌లో భారత్‌కు మరో పతకం.. రజతం గెలుచుకున్న వికాస్ ఠాకూర్
విశాఖలో టెక్ మహీంద్ర కార్యకలాపాల విస్తరణపై ఇరువురి మధ్య చర్చ జరిగిందని తెలుస్తోంది. ఏపీలో ఇంజినీరింగ్ విద్యార్థులకు ఐటీ, హై ఎండ్ టెక్నాలజీలపై నైపుణ్యాభివృద్ధి పై సీఎంతో చర్చించారు గుర్నాని. ఏపీ ప్రభుత్వం భాగస్వామ్యంతో వీటిని అమలు చేసి ఉద్యోగావకాశాలను కల్పించే అవకాశంపైనా సమావేశంలో చర్చ జరిగింది. టెక్ మహీంద్రాతో కలిసి కార్యాచరణ చేయాలని సమావేశంలో పాల్గొన్న అధికారులకు ఆదేశించారు సీఎం జగన్. ఏపీలో పారిశ్రామికీకరణ, ఐటీ సంస్థల విస్తరణ, ప్రభుత్వ ప్రోత్సాహకాల గురించి వీరు చర్చించారు.
Monkeypox: కలవరపెడుతోన్న మంకీపాక్స్.. టెన్షన్‌పెడుతోన్న కొత్త కేసులు