Ganta Srinivasa Rao and Buddha Venkanna: ఎమ్మెల్యేలతో జరిగిన సమీక్షా సమావేశం వేదికగా సీఎం వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు.. ఏ ఒక్క ఎమ్మెల్యేను పోగొట్టుకోవాలని నేను అనుకోను.. ఒక్క కార్యకర్తను కూడా పోగొట్టుకోవాలని అనుకోను అంటూ సీఎం జగన్ వ్యాఖ్యానించడంతో.. ఆయన బెదిరింపుల నుంచి బుజ్జగించే వరకు తగ్గిపోయారు అంటూ ఎద్దేవా చేశారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు.. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. సీఎం సమీక్ష సమావేశంలో స్పష్టమైన మార్పు కనిపించింది.. ఎమ్మెల్యే లు, మంత్రులకు బెదిరింపుల నుంచి బుజ్జగించే వరకు తగ్గిపోయారని కామెంట్ చేశారు.. మంత్రులను మారుస్తామని స్వయంగా చెప్పిన సీఎం.. ఇప్పుడు వెనక్కి తగ్గారని పేర్కొన్న ఆయన.. సెమీఫైనల్ లో ఫలితాలు చూసి ఖంగుతిన్నారని.. జగన్ సమావేశానికి పార్టీ ముఖ్యమైన ఎమ్మేల్యేలు, ధర్మాన వంటి నేతలు హాజరుకాకపోవడమే నిదర్శనంగా చెప్పుకొచ్చారు గంటా శ్రీనివాసరావు.
Read Also: Alla Ramakrishna Reddy: మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల ఆసక్తికర వ్యాఖ్యలు.. అందుకే రాలేదు..!
మరోవైపు.. మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మాట్లాడుతూ.. వైసీపీ టైటానికి షిప్ మునిగిపోవడానికి రెడీగా ఉందన్నారు.. వల్లభనేని వంశీ, కొడాలి నాని.. వైసీపీతోనే భూ స్థాపితం అవుతారంటూ హాట్ కామెంట్లు చేశారు. ఇక, వాళ్ళు వస్తామన్నా ఏ పార్టీ చేర్చుకోదని స్పష్టం చేశారు.. నిన్న సీఎం జగన్ సమావేశానికి వైసీపీలో అంతర్గత గ్రూప్ రాజకీయాలు కారణమన్న ఆయన.. రేపు విశాఖలో చంద్రబాబు నిర్వహించేది విజయ శంఖారావం సభగా అభిర్ణించారు. కాగా, రేపు విశాఖలో చంద్రబాబు నిర్వహించనున్న సభ.. వియ శంఖారావ సభ కానుందని టీడీపీ ప్రకటించింది. ఉత్తరాంధ్రలో 34 అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్ష సమావేశం కోసం రేపు చంద్రబాబు వస్తున్నారు. బూత్ స్థాయి నుంచి నిర్వహించే రివ్యూ పార్టీ పటిష్టతకు కీలకంగా భావిస్తోంది. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు మార్పుకు నిదర్శనంగా టీడీపీ చెబుతోంది. తూర్పున సూర్యుడు ఉదయించడం ఎంత అనివార్యమో.. 2024లో టీడీపీ గెలుపు అంతే ఖాయం అంటున్నారు టీడీపీ నేతలు.. ఇక, వైసీపీ వైఫల్యాలు, నాయకులు సాగించిన దోపిడీపై పోరాటం టీడీపీకి ఉత్తరాంధ్రలో 34స్థానాలను సాధించి పెడుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు.