Today Business Headlines 05-05-23: చైనాకి.. మంత్రి కేటీఆర్: తెలంగాణ రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్.. వచ్చే నెలలో చైనా వెళ్లనున్నారు. జూన్ 27వ తేదీ నుంచి 29వ తేదీ వరకు ఆ దేశంలోని టియాంజిన్‌లో జరగనున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో పాల్గొంటారు. ఈ మేరకు ఆయనకు ఆహ్వానం అందింది.
Business Headlines 28-02-23: అమరరాజా ఆర్ అండ్ డీ: అమరరాజా బ్యాటరీస్ సంస్థ.. రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్‌ని ఏర్పాటుచేయనుంది. హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కి దగ్గరలో ఉన్న జీఎంఆర్ ఏరోసిటీలో ఈ ‘‘ఆర్ అండ్ డీ’’ కేంద్రాన్ని అందుబాటులోకి తేనుంది. ఇ-హబ్ పేరుతో సుమారు ఏడెకరాల విస్తీర్ణంలో నిర్మించనుంది. ఈ ప్రాజెక్టు తమ గిగా కారిడార్ ప్రోగ్రామ్‌లో భాగమని అమరరాజా కంపెనీ తెలిపింది. ఈ కార్యక్రమం విలువ 9 వేల 500 కోట్ల రూపాయలని పేర్కొంది.