స్విఫ్ట్ కారు ఓవర్ స్పీడ్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఎంజీఐటీ ఇంజనీరింగ్ కాలేజ్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఎంజీఐటీ కాలేజ్‌లో బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న.. 6గురూ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఈరోజు డుమ్మా కొట్టారని తెలిపారు. "ఒక్కసారి స్టూడెంట్స్ కాలేజ్ లోనికి వచ్చారంటే బయట వెళ్ళడానికి వీలులేదు. నార్సింగి మూవీ టవర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగిందని మధ్యహ్నం 3:30 గంటలకు సమాచారం అందింది.
యువకులు వాహనాలను వేగంగా నడిపి ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇలాంటి సంఘటనలు మూడు పోలీస్ కమిషనరేట్ పరిధిలో వరుసగా చోటుచేసుకుంటున్నాయి. బైక్‌లు, కార్లలో వెళ్తున్న యువకులు మితిమీరిన వేగంతో వెళ్లడంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో యువకులు ప్రాణాలు కోల్పోతున్నారు, వాహనాలు వేగంగా ఉండడంతో వాటిని కంట్రోల్ చేయలేక ప్రాణాలు విడుస్తున్నారు. తాజాగా నార్సింగి పరిధిలో ఓ ప్రమాదం జరిగింది. ఓవర్ స్పీడ్ తో మరో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు బలయ్యారు.
అనకాపల్లి జిల్లాలో ఇద్దరు విద్యార్థులు సముద్రంలో గల్లంతయ్యారు.. రాంబిల్లి మండలంలో ఉన్న సముద్రంలో స్నానానికి దిగి ఇంజనీరింగ్ చదువుతున్న ఇద్దరు విద్యార్థులు కెరటాల దాటికి కొట్టుకుపోయారు.. కొత్తపేట గ్రామానికి చెందిన పవన్ తేజ, సూర్య తేజ లుగా గుర్తించారు.. సూర్య తేజ మృతదేహం లభ్యం కాగా పవన్ తేజ ఆచూకీ కోసం గాలిస్తున్నారు..
JNTU: జేఎన్టీయూ పరిధిలో ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థులు కాలేజీల మార్పునకు అనుమతిస్తూ జేఎన్టీయూ హైదరాబాద్ జూన్ 12న అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. విద్యార్థులు ఒక కళాశాల నుండి మరొక కళాశాలకు, ఒక విశ్వవిద్యాలయం నుండి మరొక విశ్వవిద్యాలయానికి, స్వయంప్రతిపత్త కళాశాల నుండి నాన్-అటానమస్ కళాశాలకు బదిలీ చేయడానికి అనుమతి కోసం దరఖాస్తు చేస్తారు.
విద్యార్థులు కాలేజీలోనే కొట్టుకున్నారు.. ల్యాబ్‌లో ప్రాక్టికల్స్ చేసే వస్తువులతోనే పరస్పరం దాడులకు దిగారు.. కలకలం సృష్టించిన ఈ ఘటన కాకినాడ జిల్లా గండేపల్లి మండలంలోని సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్‌లో జరిగింది. కాలేజీలోనే సీనియర్లు, జూనియర్లు గొడవకుదిగారు.. బీటెక్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్.. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ పై దాడికి దిగారు.. ల్యాబ్‌లో ప్రాక్టికల్స్ చేసే వస్తువులతో కొట్టుకున్నారు. గత కొంతకాలంగా జూనియర్లు, సీనియర్లు మధ్య వార్ నడుస్తున్నట్టుగా తెలుస్తుండగా.. ఇప్పుడు అది దాడి వరకు వెళ్లింది……
గుంటూరు జిల్లాలోని నగర పాలెం పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ ను అమ్ముతున్న నిందితులను శనివారం పోలీసులు అరెస్టు చేశారు. డ్రగ్స్‌తో సంబంధం ఉన్న ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు మాట్లాడుతూ .. మీడియాకు వివరాలు వెల్లడించారు. ప్రధాన నిందితుడు రేవంత్‌గా గుర్తించామని, రేవంత్ కోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు. పట్టుబడ్డ నిందితులు ఇంజనీరింగ్ విద్యార్థులుగా విచారణలో తేలిందన్నారు. నిందితుల దగ్గరనుంచి 150 గ్రాముల గంజాయి. మూడు సెల్ ఫోన్స్ స్వాధీనం…