CM Chandrababu: నిర్వాసితుల త్యాగానికి ప్రతిఫలం పోలవరం ప్రాజెక్టు.. మీరు ప్రజల హృదయాల్లో నిలిచిపోతారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: లవరం ప్రాజెక్టులోని వివిధ ముంపు గ్రామాల నిర్వాసితులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా, పునరావాస పరిహార ప్యాకేజీ మూడో విడతలో భాగంగా, నిర్వాసితులకు రూ.226 కోట్ల చెక్కును అందించారు. ప్రాజెక్టు నిర్వాసితులతో సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి జీవనాడిగా మారాలని, నదులు అనుసంధానం జరిగితే రాష్ట్రవ్యాప్తంగా ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. గత పాలకులు నిర్వాసితులను పట్టించుకోలేకపోయారు. వారు వరద నీటిలో మునిగిపోతున్నా నిర్లక్ష్యంగా వదిలేశారని తెలిపారు. రంపచోడవరం నియోజకవర్గం కేంద్రంగా పోలవరం జిల్లాని ఏర్పాటు చేశామని చెప్పారు.
ప్రాజెక్టు నిర్వాసితులు సంపూర్ణ రాష్ట్ర ప్రయోజనాల కోసం తమ ఇళ్లను, భూములను త్యాగం చేశారని చెప్పారు సీఎం చంద్రబాబు.. ఈ ఉగాది పండుగను పురస్కరించుకుని నిర్వాసితుల ఖాతాల్లో రూ.226 కోట్లు జమ చేస్తున్నామని, వచ్చే ఉగాది తర్వాత రెండు నెలల్లోనే పోలవరం ప్రాజెక్టు పూర్తై మన అందరి కల సాకారం అవుతుందని ముఖ్యమంత్రి చెప్పారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల డయాఫ్రాం వాల్ దెబ్బతిన్నది, దీనిపై నిపుణులతో అధ్యయనం చేసి ఇప్పుడు కొత్త డయాఫ్రాం వాల్ నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు. వారంలో డయాఫ్రాం వాల్ నిర్మాణం పూర్తవుతుందని తెలిపారు. ప్రాజెక్టు ముమ్మరంగా పనులు జరుగుతున్నాయన్నారు. 21 నెలల్లో ప్రాజెక్టు పనులు వేగవంతం చేశామని, 2025 జనవరిలో సంక్రాంతి పండుగలో మొదటి విడతగా నిర్వాసితులకు రూ.800 కోట్లు ఇచ్చామని తెలిపారు.
Also Read
- Polavaram Agency: ఏజెన్సీలో ఇంకా డోలీ మోతలే.. 4 కొండలు దాటి బాలికను మోసుకెళ్లిన గిరిజనులు
- Papikondalu Boat Tour: పాపికొండల విహారయాత్రకు గ్రీన్ సిగ్నల్.. 18 రోజుల తర్వాత మళ్లీ బోటు షికారు
- MLA Chirri Balaraju: పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కార్యాలయంలో ఉద్రిక్తత..
- Lemon Prices: అమాంతం పెరిగిన నిమ్మకాయల ధరలు.. రూ.30 నుంచి రూ.130కి..!
దీపావళి సందర్భంగా రెండో విడతగా రూ.916 కోట్లను నిర్వాసితుల ఖాతాల్లో జమ చేశారు. మూడో విడతగా ఉగాది పండుగ సందర్భంగా రూ.226.6 కోట్లను చెల్లిస్తున్నారు. ఈ 21 నెలల్లో 26,149 మంది నిర్వాసితులకు మొత్తం రూ.1943.53 కోట్లను చెల్లించామని వెల్లడించారు సీఎం చంద్రబాబు.. ప్రాజెక్టు రెండు దశలుగా నిర్మితమవుతుంది. 38,068 మంది నిర్వాసితులు మొదటి దశలో ఉన్నారు. 75 నిర్వాసిత కాలనీల్లో 26 పూర్తయ్యాయి, ఇంకా 49 కాలనీలు నిర్మాణంలో ఉన్నాయని చెప్పారు. 2026 డిసెంబరులో వీటి నిర్మాణం పూర్తి అవుతుందని చెప్పారు. ఇంకా రూ.3,500 కోట్ల ఖర్చు చేయాల్సి ఉందన్నారు. ప్రతీ నిర్వాసితుడికి రూ.3.5 లక్షల ఇంటి నిర్మాణం కోసం ఇవ్వాలని, ఇంటి జాగా కోసం రూ.2 లక్షలకు పెంచారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు అయినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం ఎంతో నిబద్ధతతో ఈ నిర్మాణాన్ని పూర్తి చేస్తోందని చెప్పారు. గత పాలనలో తప్పులు జరిగాయనీ వాటిని క్షమించమని తెలిపారు.
మా ప్రభుత్వానికి కమిట్మెంట్:
పారదర్శకంగా నిర్వాసితులకు చెల్లింపులు చేస్తున్నామని చెప్పారు సీఎం చంద్రబాఉ.. నిర్వాసితులు దళారులను నమ్మి మోసపోవద్దు అని సూచించారు. గోదావరి పుష్కరాలు మూడోసారి నిర్వహించడానికి గౌరవం దక్కిందని, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని తెలిపారు. ప్రారంభానికంటే ముందే నిర్వాసితులందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ప్రాజెక్టు పూర్తికి మరో రూ.5 వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉందన్నారు. ఒక వంతెన కూడా నిర్మించబడుతుందని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు కోసం త్యాగం చేసిన నిర్వాసితులంతా ప్రజల హృదయాల్లో నిలిచి పోతారని అన్నారు. నిర్వాసితుల త్యాగం ప్రతిఫలంగా పోలవరం ప్రాజెక్టు దేశానికి అత్యంత గొప్పదిగా నిలుస్తుందని ముఖ్యమంత్రి అన్నారు. నిర్వాసితులకు న్యాయం చేయడంలో కూటమి ప్రభుత్వం సౌకర్యాలను అందిస్తున్నది, వారి సంక్షేమం కోసం మేం కృషి చేస్తున్నామన్నారు. ఇంకా, గౌరవం కోసం లభ్యమైన నిధులను సద్వినియోగం చేసుకోవాలని ప్రధాని సూచించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
తాజావార్తలు
-
Spiritలో ఆ స్టార్ హీరోయిన్ స్పెషల్ అపియరెన్స్? ఇది నిజమేనా డార్లింగ్!
-
Bengaluru Crime: త్రిపుల్ మర్డర్ కేసులో షాకింగ్ ట్విస్ట్.. AI సాయంతో ముగ్గురిని లేపేశాడు!
-
Virat Kohli and Anushka Sharma: బురదలో చెప్పులు లేకుండా నడిచిన విరాట్, అనుష్క.. స్టార్ కపుల్ బృందావన్ వీడియో వైరల్..
-
IND vs ZIM: భారత్‌తో టీ20 సిరీస్.. జింబాబ్వే జట్టు ప్రకటన.. స్టార్లను కూడా వణికించే పేసర్‌కు చోటు!
-
Anantnag Terror Attack: జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడి.. కాల్పుల్లో హెడ్ కానిస్టేబుల్ మృతి
ట్రెండింగ్
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!
-
OLED డిస్ప్లే, RTX 5090 GPUతో పవర్ఫుల్ పనితీరుతో Dell కొత్త Alienware గేమింగ్ ల్యాప్‌టాప్‌లు లాంచ్..! ఫీచర్స్, ధరలు ఇలా..!