Spiritలో ఆ స్టార్ హీరోయిన్ స్పెషల్ అపియరెన్స్? ఇది నిజమేనా డార్లింగ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Spirit: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, సెన్సేషనల్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అత్యంత ప్రతిష్ఠాత్మక తెరకెక్కిస్తున్న చిత్రం ‘స్పిరిట్’ (Spirit). ఈ సినిమా గురించి రోజుకో కొత్త వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇప్పటికే ఈ సినిమాపై పాన్ ఇండియా లెవల్లో భారీ అంచనాలు నెలకొనగా, తాజాగా మరో ఇంట్రెస్టింగ్ బజ్ సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. తాజా ప్రచారం ప్రకారం.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించే అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపిస్తోంది.
అయితే ఇది పూర్తి స్థాయి పాత్ర కాకుండా, కేవలం రెండు రోజుల షూటింగ్‌తో పూర్తయ్యే స్పెషల్ అపియరెన్స్ అని సమాచారం. స్క్రీన్ టైమ్ తక్కువగానే ఉన్నప్పటికీ, ఆమె పాత్ర కథను కీలక మలుపు తిప్పే విధంగా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తన సినిమాల్లో ఊహించని పాత్రలు, షాకింగ్ ట్విస్టులు, బలమైన ఎమోషనల్ మూమెంట్స్‌ను చూపించడంలో ప్రత్యేక గుర్తింపు పొందారు. దీంతో కత్రినా కైఫ్ నిజంగానే ఈ ప్రాజెక్ట్‌లో భాగమైతే, ప్రేక్షకులకు మరోసారి సర్ప్రైజ్ ఖాయం అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే కత్రినా కైఫ్ నటిస్తున్నారనే విషయంపై ఇప్పటివరకు చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్తపై డార్లింగ్ అభిమానులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఇప్పటికే ‘స్పిరిట్’ మూవీ ఇండియన్ సినీ ఇండస్ట్రీలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒకటిగా నిలిచింది. తాజా ప్రచారం నిజమైతే సినిమాపై ఉన్న అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉంది. టి-సిరీస్ ఫిలిమ్స్, భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్లో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 2027 మార్చి 5న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
Also Read
- Sheraz Mehdi: బెదిరింపులకు వెనక్కి తగ్గను.. 100 ప్రెస్మీట్లు, ర్యాలీలకైనా సిద్ధం!
- Yash-Hanuma Reddy: ఏంటి మావా ఇది.. టాలీవుడ్ కొత్త దర్శకుడితో రాకీ భాయ్ పాన్-ఇండియా మూవీ?
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
తాజావార్తలు
-
Sheraz Mehdi: బెదిరింపులకు వెనక్కి తగ్గను.. 100 ప్రెస్మీట్లు, ర్యాలీలకైనా సిద్ధం!
-
JSW Combat SUV వచ్చేస్తోంది.. పెట్రోల్ లేకుండా 90 కి.మీ ప్రయాణం.. ఫుల్ ట్యాంక్, ఒక్క ఛార్జ్‌తో 1,100 కి.మీ రేంజ్..
-
Woman Sarpanch Candidate Promises: నన్ను గెలిపించండి.. మీ పెళ్లి చేసే బాధ్యత నాది..! సర్పంచ్ అభ్యర్థి హామీ వైరల్
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Dhruv Rathee: సీజేపీ నిరసనకు ముందు ఉత్కంఠ.. పోలీసుల అదుపులో ధ్రువ్ రాఠీ..
ట్రెండింగ్
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!