Minister Nimmala Ramanaidu: 2027 డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి.. నిర్వాసితులకు న్యాయం చేస్తాం..
- 2027 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి..
- నిర్వాసితులకు పూర్తి న్యాయం చేస్తామన్న మంత్రి నిమ్మల..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Nimmala Ramanaidu: 2027 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడంతో పాటు నిర్వాసితులకు పూర్తి న్యాయం చేస్తామన్నారు ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో జరుగుతున్న నూతన డయాఫ్రం వాల్ నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరును అధికారులు మంత్రికి వివరించారు. జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో విధ్వంసం జరిగిందని ఆరోపించారు.. సీఎం చంద్రబాబు షెడ్యూల్ ప్రకటించినట్లుగానే జనవరిలోనే డయా ఫ్రం వాల్ పనులు మొదలుపెట్టాం.. డయా ఫ్రం వాల్ నిర్మాణ పనులుసగం పూర్తవ్వగానే, ఈసీఆర్ఎఫ్ డ్యాం పనులు కూడా మొదలుపెడతాం.. గతంలో 18 నెలలు కష్టపడి చంద్రబాబు డయా ఫ్రం వాల్ నిర్మిస్తే, జగన్ విధ్వంసం చేశాడు. జగన్ తుగ్లక్ పాలన ఫలితంగా పోలవరం ప్రాజెక్ట్ మరో 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయిందని విమర్శించారు.. పాత డయా ఫ్రంవాల్ బదులు కొత్త డయా ఫ్రం వాల్ నిర్మాణం వల్ల మరో 1000 కోట్లు అదనపు భారం పడింది.. ఏడేళ్ళ క్రితం పోలవరం నిర్వాసితులకు 800 కోట్లు పరిహారం అందించిన చంద్రబాబే మరలా ఇప్పుడు మరో 1000 కోట్లు పరిహారం అందించారని వెల్లడించారు.
Read Also: CM Chandrababu: భారతీయుల గోల్డెన్ ఎరా మొదలైంది.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..
Also Read
- Chandrababu on Mega DSC: డీఎస్సీపై వైసీపీ ఆందోళనలకు చంద్రబాబు కౌంటర్.. కీలక వ్యాఖ్యలు
- CM Chandrababu: వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్.. గంజాయి, రౌడీయిజంపై సంచలన వ్యాఖ్యలు
- Nuzvid Love Marriage Twist: ప్రేమ వివాహం తర్వాత ట్విస్ట్.. భార్యను అప్పగించేందుకు రూ.12 లక్షలు డిమాండ్?
- Polavaram Agency: ఏజెన్సీలో ఇంకా డోలీ మోతలే.. 4 కొండలు దాటి బాలికను మోసుకెళ్లిన గిరిజనులు
2019 ఎన్నికల ముందు పోలవరం నిర్వాసితులకు అదనంగా 10 లక్షల పరిహారం అందిస్తానని చెప్పి.. గెలిచాక జగన్ నిర్వాసితులను మోసం చేశాడు.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కేంద్రాన్ని ఒప్పించి రూ. 12159 కోట్లు తీసుకొచ్చాం అన్నారు మంత్రి నిమ్మల.. నిర్వాసితులకు న్యాయం జరిగేలా, ప్రాజెక్టు నిర్మాణంతో పాటే, సమాంతరంగా పునరావాసకాలనీలు సైతం నిర్మిస్తాం.. పోలవరం ప్రాజెక్టు పనులను షెడ్యూల్ ప్రకారం పూర్తి చేసి, గోదావరి జలాలను ఇటు ఉత్తరాంధ్ర, అంటు రాయలసీమకు తీసుకెళ్తాం.. 2027 నాటికి పోలవరం పూర్తి చేయడంతో పాటు నిర్వాసితులకు పూర్తి న్యాయం చేస్తాం అని స్పష్టం చేశారు ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు.
తాజావార్తలు
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్‌కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
-
Mood of the Nation: సీఎం అయిన 3 నెలలకే ప్రధాని రేసులోకి తలపతి విజయ్!
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!