దశాబ్దాల కలగా మిగిలిన కొల్లేరు సమస్యల పరిష్కారం ఎదురు చూస్తున్నారు ఇక్కడి ప్రజలు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలతో త్వరలోనే అది సాధ్యమవుతుందని కూడా నమ్ముతున్నారట. ఈ క్రమంలో ఇప్పుడు వైసీపీ నేతలు కొందర్ని అనుమానాలు, అసంతృప్తి వెంటాడుతున్నట్టు తెలుస్తోంది. అందుకు కారణాలు కూడా గట్టిగానే ఉన్నాయి. కేంద్ర సాధికారిక కమిటీ ఇటీవల కొల్లేరు గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించింది. రెండు రోజుల పాటు అయా ప్రాంతాల ప్రజల నుంచి పెద్ద ఎత్తున వినతి పత్రాలు స్వీకరించింది.
Kolleru: కొల్లేరుపై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. కొల్లేరు వన్యప్రాణుల అభయారణ్యంపై మరోసారి తనిఖీ జరపాలని “కేంద్ర సాధికార కమిటీ”కి జస్టిస్ బీఆర్ గవాయి ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. అయితే, కొల్లేరులో ప్రైవేటు భూములను నోటిఫై చేయడంపై సుప్రీంకోర్టును ప్రైవేటు మత్స్యకారులు సంఘం ఆశ్రయించిన విషయం విధితమే.
కొల్లేరు వాసులకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారానికి నోచుకుంటాయనే నమ్మకం పెరుగుతుంది. కొల్లేరు ప్రాంత జిరాయితీ భూముల యజమానులు దాఖలు చేసిన ఇంప్లీడ్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. కొల్లేరు వివాదానికి కారణమవుతున్న అంశాలపై 12 వారాల్లో నివేదిక ఇవ్వాలని కేంద్ర సాధికార సంస్థకు అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. దీంతో దశాబ్దాలుగా తాము ఎదుర్కొంటున్న సమస్యలకి పరిష్కారం దొరుకుతుందనే ఆశతో కొల్లేరు వాసులు ఉన్నారు. కొల్లేరు ప్రాంతంలో 5వ కాంటూరు…
విజయవాడ మునకకు కారణం బుడమేరు కాదు.. నాయకుల తప్పిదం అన్నారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, పూడిక తీస్తే వరదల ప్రభావం అంతగా ఉండదు.. ఆక్రమణల కారణంగా ముంపునకు ప్రభుత్వాలు చేసే తప్పుడు పనుల వల్ల ప్రజలకు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. ఏలూరు జిల్లా మండవల్లి మండలం పెనుమాకలంక గ్రామంలో పర్యటించిన ఆయన.. కొల్లేరును పరిశీలించి గ్రామ సమస్యలను అడిగి తెలుసుకున్నారు..
Vijayawada Floods: కొల్లేరుకు బుడమేరు వాగు వరద ఉధృతి భారీగా పెరిగిపోయింది. నిన్నటి కంటే రెండు అడుగుల మేర కొల్లేరు నీటి మట్టం ఎక్కువ అయిందని అధికారులు చెప్తున్నారు. దీంతో 15 గ్రామాలకు రాకపోకలకు నిలిచిపోయిన పరిస్థితి ఏర్పడింది. కే
బుడమేరు కొల్లేరులోకి ప్రవహించడంతో చుట్టు పక్కల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.. ఏలూరు నుండి కైకలూరు వచ్చే రహదారి మీదగా నీరు ప్రవహించడంతో ముందస్తుగా వాహనాలను నిలిపివేశారు పోలీసులు.. ఈ రాత్రికి కొల్లేరు వరద నీరు పెరిగే అవకాశం ఉందని అధికారుల అంచనా వేస్తున్నారు.. ఇప్పటికే కొన్ని గ్రామాలు నీట మునిగాయి.. కొల్లేరులోకి వరద రెండు అడుగుల మేర పెరిగితే భారీ నష్టం జరిగే అవకాశం ఉందంటున్నారు.
కొల్లేరు చేపల చెరువులకు బుడమేరు ముంపు గండం పొంచిఉంది.. బుడమేరుకు వరద పెరగటంతో వేల ఎకరాల్లో ఉన్న చెరువులకు ముంపు వాటిల్లే అవకాశం ఉంది అంటున్నారు.. ఇవాళ సాయంత్రానికి బుడమేరు వరద మరింత పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు.. మరో రెండు అడుగులు వరద పెరిగితే 10 వేల ఎకరాల్లో చెరువులు నీట మునుగుతాయనే భయంతో వ్యాపారుల ఆందోళన నెలకొంది..
దేవాకట్టా దర్శకత్వంలో వచ్చిన ‘రిపబ్లిక్’ చిత్రం అక్టోబరు 1న విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంటూ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.. సాయిధరమ్ తేజ్, ఐశ్వర్య రాజేశ్ జంట నటించగా.. సామాజిక దృక్కోణంలో తెరకెక్కించిన ఈ చిత్రంలో సాయిధరమ్ తేజ్ ఐఏఎస్ అధికారిగా కనిపిస్తారు. ఇదిలావుంటే, రిపబ్లిక్ సినిమాపై ప.గో జిల్లా, కొల్లేరు గ్రామాల వాసూలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినిమాలో చెరువులను, చేపలను విషతుల్యం చేస్తున్నాం అని మా గ్రామాలపై దుష్ప్రచారం చేశారు. కొల్లేరు వాసుల…