Gorantla Butchaiah Chowdary: విజయసాయిరెడ్డిని కూటమిలో చేర్చుకోవడానికి వీల్లేదు.. సీనియర్ నేత డిమాండ్
- కూటమిలో విజయసాయిరెడ్డిని చేర్చుకోవడానికి వీల్లేదు..
- అలా చేర్చుకుంటారని అనుకోవడం లేదు..
- గోరంట్ల బుచ్చయ్య చౌదరి సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gorantla Butchaiah Chowdary: రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను.. ఇక వ్యవసాయం చేసుకుంటానని ప్రకటించిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉన్న విజయసాయిరెడ్డి.. ఆ తర్వాత తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.. ఇదే సమయంలో.. చంద్రబాబుతో తనకు ఎలాంటి వ్యక్తిగత వైరం లేదని.. పవన్ కల్యాణ్ తనకు చిరకాల మిత్రుడు అంటూ వ్యాఖ్యానించారు.. అంతేకాదు… ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ప్రస్తావన కూడా తీసుకొచ్చారు దీంతో, విజయసాయిరెడ్డి చూపు.. కూటమి పార్టీల వైపు ఉందా..? అనే ప్రచారం తెరపైకి వచ్చింది.. అయితే, కూటమిలో విజయసాయిరెడ్డిని చేర్చుకోవడానికి వీల్లేదని, అలా చేర్చుకుంటారని అనుకోవడం లేదని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Read Also: Butchaiah Chowdary: లోకేష్‌కి డిప్యూటీ సీఎం పదవి..! బుచ్చయ్య చౌదరి సంచలన వ్యాఖ్యలు
Also Read
- Godavari Flood Alert: గోదావరి ఉగ్రరూపం.. 9.62 లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి విడుదల
- Korukonda Tragedy: వినాయక చవితి వేళ విషాదం.. కలువ పువ్వుల కోసం వెళ్లి ఇద్దరు మృతి
- Railway Accident: కొవ్వూరు వద్ద పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన రైళ్లు..
- Subramanyam Murder Case: డ్రైవర్ వీధి సుబ్రమణ్యం హత్య కేసులో కీలక పరిణామం..
ఒకవేళ బీజేపీ చేర్చుకున్నట్లైతే ఆ పార్టీ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు బుచ్చయ్య చౌదరి. అవినీతి అక్రమాలకు పాల్పడిన వాడు ఎవడైనా సరే శిక్షలు తప్పవని, అక్రమాలకు పాల్పడి.. అధికారం పోయిన తర్వాత పార్టీలో చేరిపోదాం అనుకుంటే.. చేర్చుకోవడం సరైంది కాదన్నారు. అలాగే అధికారం వుందా కదా అని మనం కూడా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ప్రజలు ఊరుకోరని గోరంట్ల హెచ్చరించారు. విజయసాయి విశాఖపట్నంలో దోపిడీ చేశారని, కాకినాడ పోర్టును అల్లుడుకు దోచిపెట్టాడని, విశాఖలో లక్షల కోట్లు దోచేశారని.. అవన్నీ కూడా తిరిగి బాధితులకు అప్పగించాలని గోరంట్ల డిమాండ్ చేశారు. ప్రజాబలం తో 164 సీట్లు కూటమికి వచ్చాయని, ఇప్పుడు అక్రమాలు చేసిన నాయకులు వస్తామని చెబితే దేనికోసం అని గోరంట్ల ప్రశ్నించారు. వైసీపీ రాబోయే రోజుల్లో కనుమరుగవుతుందని, ఆ పార్టీలో అందరూ సర్దుకుంటారన్నారు. అక్రమాలు, అవినీతి లేని నాయకులు వస్తే అధిష్ఠానం ఆలోచించుకుంటుందని పేర్కొన్నారు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి.
తాజావార్తలు
-
India Plan: అదిరిపోయిన గంభీర్, శ్రేయస్ అయ్యర్ ప్లాన్.. రెండో టీ20 ఓటమి నుంచి మూడో టీ20లో గెలుపుకు పాటించిన సూత్రం ఇదే..
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే, ఊహించని..!
-
INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
-
Big Rain Alert: ఏపీకి మరో వాయుగుండం ముప్పు.. అలర్ట్ జారీ చేసిన అధికారులు..
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!