Subramanyam Murder Case: డ్రైవర్ వీధి సుబ్రమణ్యం హత్య కేసులో కీలక పరిణామం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Subramanyam Murder Case: దళిత యువకుడు, డ్రైవర్ వీధి సుబ్రమణ్యం హత్య కేసు విచారణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు విచారణను ఇవాళ్టి నుంచి రోజువారీగా నిర్వహించనున్నారు. న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టులో డే-టు-డే ట్రయల్ ప్రారంభం కానుంది. మొత్తంగా తూర్పుగోదావరి జిల్లాలో సంచలనం సృష్టించిన డ్రైవర్ వీధి సుబ్రమణ్యం హత్య కేసు విచారణలో వేగం పెరగనుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఉన్నారు.. విచారణ జాప్యం అవుతోందన్న అంశంపై సమీక్షించిన హైకోర్టు, కేసును రోజువారీగా విచారించాలని ఆదేశాలు జారీ చేసింది.
సుప్రీంకోర్టు సూచనల మేరకు రాజమహేంద్రవరంలో ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటు చేయగా, ఇవాళ్టి నుంచి ఇక్కడే డే-టు-డే విచారణ జరగనుంది. ఈ క్రమంలో సాక్ష్యుల వాంగ్మూలాల నమోదు ప్రక్రియను ప్రత్యేక కోర్టు చేపట్టనుంది. విచారణకు సంబంధించి పోలీసులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్, నిందితుల తరపు న్యాయవాదులకు న్యాయస్థానం ఇప్పటికే సమాచారం అందించింది. కేసు విచారణ వేగవంతం కావడంతో బాధిత కుటుంబ సభ్యులు న్యాయం త్వరగా జరుగుతుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైన వీధి సుబ్రమణ్యం హత్య కేసులో రోజువారీ విచారణ ప్రారంభం కావడం కీలక పరిణామంగా మారింది. ప్రత్యేక కోర్టు విచారణతో కేసు త్వరితగతిన తుది దశకు చేరుకునే అవకాశం కనిపిస్తోంది..
Also Read
- Korukonda Tragedy: వినాయక చవితి వేళ విషాదం.. కలువ పువ్వుల కోసం వెళ్లి ఇద్దరు మృతి
- Railway Accident: కొవ్వూరు వద్ద పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన రైళ్లు..
- Daggubati Purandeswari: 2024 ఫార్ములానే స్థానిక ఎన్నికల్లోనూ.. పురందరేశ్వరి కీలక వ్యాఖ్యలు
- Medical Student Priyanka Case: ప్రియాంక కేసులో కీలక మలుపు.. హత్యాయత్నం నుంచి హత్య కేసుగా మార్పు
తాజావార్తలు
-
BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
-
Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
-
Nani: “18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు” ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
-
Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
-
LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?