Most Wanted Criminal: పోలీసుల నుంచి తప్పించుకున్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్.. రంగంలోకి 10 టీమ్‌లు..
- ఐదు రాష్ట్రాల్లో వందకు పైగా కేసుల్లో నిందితుడు..
- పోలీసులకు షాక్ ఇచ్చిన మోస్ట్ వాంటెడ్ బత్తుల ప్రభాకర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Most Wanted Criminal: ఐదు రాష్ట్రాల్లో వందకు పైగా కేసుల్లో నిందితుడిగా ఉన్న బత్తుల ప్రభాకర్.. ఆంధ్రప్రదేశ్ పోలీసులకు రెండోసారి షాక్ ఇచ్చాడు.. మోస్ట్ వాంటెట్ క్రిమినల్ అని తెలిసికూడా ప్రభాకర్‌ను తరలించే సమయంలో పోలీసులు అజాగ్రత్తగా ఉన్నారా..? లేదా గత రాత్రి పోలీసుల నుంచి తప్పించుకున్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ కు ఎవరు సహకరించారు..? అనే కోణంలో ఇపుడు చర్చ నడుస్తోంది. విజయవాడ నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించే సమయంలో రిమాండ్ ఖైదీ బత్తుల ప్రభాకర్ తూర్పుగోదావరిజిల్లా దేవరపల్లి మండలం దుద్దుకూరు సమీపంలో తప్పించుకున్నాడు. చేతికి బేడీలు ఉన్నాయని, అతన్ని పట్టిస్తే నజరానా ఇస్తామంటూ ప్రకటన ఇచ్చన పోలీసులు.. అతని విషయంలో ఎందుకు సీరియస్‌గా ఉండలేకపోయారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్ళ ఎస్కార్ట్ నుంచి తప్పించుకుపోయి గంటలు గడుస్తున్నా పోలీసులకు తిరిగి చిక్కకపోవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ముందుగానే ప్లాన్ చేసుకుని పారిపోయాడా? లేక ఎవరైనా అతనికి సహకరించారా? అనే కోణంలో ఉన్నతాధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. దాదాపు పది బృందాలు రిమాండ్ ఖైదీకోసం గాలింపు ముమ్మరం చేసాయి. బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసారు. అయితే, రిమాండ్ ఖైదీ తప్పించుకున్న ఘటనపై సీసీ ఫుటేజ్‌లు సేకరించే పనిలో పోలీసు బృందాలు నిమఘ్నమయ్యాయి.
Read Also: AP Legislative Council: మండలిలో మరోసారి మంత్రి లోకేష్ వర్సెస్ బొత్స సత్యనారాయణ..
Also Read
- Deputy CM Pawan Kalyan: గోదావరి కాలుష్యంపై పవన్ కల్యాణ్.. రెండో రోజు కూడా క్షేత్రస్థాయిలో తనిఖీలు
- Deputy CM Pawan Kalyan: గోదావరి పుష్కరాలు ఏర్పాట్లపై సమీక్ష.. పవన్ కల్యాణ్ తీవ్ర అసంతృప్తి
- MLC AnanthaBabu: ఎమ్మెల్సీ అనంతబాబుకు షాక్.. బెయిల్ రద్దు చేసిన కోర్టు
- CM Chandrababu: మహిళా బిల్లును అడ్డుకోవడం పెద్ద విద్రోహం..
తాజావార్తలు
-
IND Vs AFG: చరిత్ర స్పష్టించిన భారత్.. కొత్త రికార్డు నమోదు..
-
Lakshadweep: లక్షద్వీప్‌లో మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్.. 47 ఏళ్ల నిషేధానికి తెర.. కారణం ఇదే..
-
Iran Vs Israel: యుద్ధం మళ్లీ మొదలు..! ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడుల వెనుక ఉన్న కారణాలేంటి?
-
Gym Tips : వర్కౌట్ మధ్యలో కోల్డ్ వాటర్.. మంచిదా? ప్రమాదమా.?
-
Putin: పుతిన్ భద్రతపై రష్యా సంచలన నిర్ణయం.. నిఘా వ్యవస్థలపై తాత్కాలికంగా..!
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!