ఢిల్లీలో ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. గొడవల కారణంగా ఓ భార్య తన భర్త ప్రైవేట్ పార్ట్ కోసి పారిపోయింది. దీంతో భర్త పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించి చికిత్స కొనసాగిస్తున్నారు. అయితే ఈ నేరానికి పాల్పడడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
జార్ఖండ్‌లోని హజారీబాగ్‌లోని ఒక ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డును చంపి.. జీవిత ఖైదు అనుభవిస్తున్న ఖైదీ పోలీసు కస్టడీ నుండి తప్పించుకున్నాడు. షేక్ భిఖారీ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో ఈ ఘటన జరిగింది. తన దగ్గరున్న ఇనుప రాడ్‌తో ఆస్పత్రి సెక్యూరిటీ గార్డుపై దాడి చేసి అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యాడు.