Delhi to Rajahmundry Direct Flight: నేరుగా రాజమండ్రి టు ఢిల్లీ.. విమాన సర్వీస్ ప్రారంభం..
- రాజమండ్రి ఎయిర్ పోర్ట్ నుంచి ఢిల్లీకి నేరుగా విమాన సర్వీస్..
- ఢిల్లీ నుంచి రాజమండ్రి మధురపూడి విమానాశ్రయానికి చేరుకున్న ఫస్ట్ విమానం..
- తొలి విమాన సర్వీసులో ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi to Rajahmundry Direct Flight: రాజమండ్రి ఎయిర్ పోర్ట్ నుంచి న్యూఢిల్లీకి నేరుగా విమాన సర్వీస్ ప్రారంభమైంది. న్యూఢిల్లీ నుంచి రాజమండ్రి మధురపూడి విమానాశ్రయానికి చేరుకుంది మొదటి ఇండిగో డైరెక్ట్ ఫ్లైట్.. తొలి విమాన సర్వీసులో ఢిల్లీ నుంచి నేరుగా రాజమండ్రి వచ్చారు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్.. ఇక, రన్ వే పై ల్యాండ్ అయిన ఇండిగో ఎయిర్ బస్ కు వాటర్ కెనాల్స్ తో ఎయిర్ పోర్ట్ సిబ్బంది స్వాగతం పలికారు.
Also Read
- Godavari Flood Alert: గోదావరి ఉగ్రరూపం.. 9.62 లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి విడుదల
- Korukonda Tragedy: వినాయక చవితి వేళ విషాదం.. కలువ పువ్వుల కోసం వెళ్లి ఇద్దరు మృతి
- Railway Accident: కొవ్వూరు వద్ద పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన రైళ్లు..
- Subramanyam Murder Case: డ్రైవర్ వీధి సుబ్రమణ్యం హత్య కేసులో కీలక పరిణామం..
ఈ సందర్భంగా జరిగిన సభలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ విమాన ప్రయాణం విషయంలో డబ్బు కంటే సమయం గురించి ప్రజలు ఆలోచిస్తున్నారని అన్నారు. రానున్న ఐదేళ్లలో దేశంలో 50 కొత్త విమానాశ్రయాలు రాబోతున్నాయని వెల్లడించారు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యేనాటికి దేశంలో విమానాశ్రయాలు 74.. కానీ, ఇప్పుడు దేశంలో విమానాశ్రయాలు సంఖ్య 158కి పెరిగిందని తెలిపారు.. త్వరలో రాజమండ్రి ఎయిర్పోర్ట్ నూతన టెర్మినల్ భవనం కూడా పూర్తి చేస్తామని అన్నారు. ఢిల్లీ ప్లైట్ లో నేరుగా.. రాజమండ్రి వాసులతో సంతోషం పంచుకునేందుకు వచ్చాను అన్నారు రామ్మోహన్ నాయుడు.. ఇవాళ పార్లమెంట్ సెషన్స్ , కేంద్ర కేబినెట్ మీటింగ్ ఉన్న నేపథ్యంలో.. తిరిగి అదే ఫ్లైట్‌లో ఢిల్లీ బయలుదేరి వెళ్లారు కేంద్ర పౌర విమానాయ శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు..
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!