Mangampeta Murder Case: కన్న కూతురి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడని కువైట్ నుంచి వచ్చి.. అనుకున్న పని కానిచ్చి.. తిరిగి వెళ్లిపోయాడు.. ఆ తర్వాత వీడియో విడుదల చేసి.. తప్పంతా పోలీసులదే అంటూ మండిపడుతున్నాడు ఓ నిందితుడు . అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలం మంగంపేటలో నిద్రిస్తున్న వికలాంగుడిని అత్యంత దారుణంగా తగల పగలగొట్టి చంపారు గుర్తు తెలియని వ్యక్తులు. అయితే, ఈ కేసులో విచారణ చేపట్టిన పోలీసులకు దిమ్మతిరిగే నిజాలు వెలుగు చూశాయి. కన్నకూతిరిపట్ల ఆ వికలాంగుడు అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆ కోపంతో కువైట్ నుంచి వచ్చి.. చంపి అక్కడి నుంచి తిరిగి కువైట్ కి వెళ్లినటువంటి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Read Also: America: సారీ.. ఖలిస్థానీ ఉగ్రవాది పన్నూన్ బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వడం కుదరదు..
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తమకు అన్యాయం జరిగిదంటూ ఎవరైనా ఆశ్రయించినప్పుడు పోలీసులు సకాలంలో సరిగా స్పందించకపోతే బాధితుల్లో ఎంత ఆవేదన గూడు కట్టుకుంటుందో, ఒక్కోసారి ఎంత తీవ్రంగా ప్రవర్తిస్తారో తెలియజేసే సంఘటన ఇది. తన బిడ్డ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన బంధువుపై పోలీసులకు ఫిర్యాదు చేసినా.. సరిగా స్పందించక పోవడంతో ఒక వ్యక్తి ఏకంగా కువైట్ నుంచి వచ్చి అతడిని హత్య చేశాడు. ఎవ్వరికి తెలియకుండా తిరిగి కువైట్ వెళ్లిపోయాడు. అనంతరం అతడు ఒక వీడియో విడుదల చేశాడు. దీంతో ఈ ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలంలో గత శనివారం తెల్లవారుజామున ఓ దివ్యాంగుడు (59) హత్యకు గురయ్యారు. పోలీసులు అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కానీ, అతడు తన కుమార్తె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో తానే కువైట్ నుంచి వచ్చి మరీ హత్య చేసి వెళ్లానని నిందితుడే సోషల్ మీడియాలో వీడియోను పోస్టు చేయడం సంచలనంగా మారింది.
Read Also: Telangana Secretariat: నేటి నుంచి సెక్రటేరియట్‌లో అటెండెన్స్.. లేటుగా వస్తే లాసేనా..
ఓబులవారిపల్లె మండలానికి చెందిన దంపతులు కువైట్‌లో ఉంటున్నారు. దీంతో తమ కుమార్తె(12)ను ఊళ్లో ఉంటున్న చెల్లెలు, ఆమె భర్త వద్ద ఉంచారు. ఇటీవల చెల్లెలి మామ.. మనవరాలి వరస అయ్యే ఆ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ విషయాన్ని బాలిక తన తల్లికి ఫోన్ చేసి తెలిపింది. ఆమె వెంటనే చెల్లెలికి ఫోన్ చేసి అడగ్గా, ఆమె సరిగా స్పందించలేదు. ఆందోళనతో తల్లి కువైట్ నుంచి వచ్చి ఓబులవారిపల్లె పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అయితే, పోలీసులు నిందితుడు దివ్యాంగుడిని పిలిపించి మందలించి వదిలేశారు. ఆమె ఈ విషయాన్ని భర్తకు చెప్పింది. తీవ్ర ఆవేదనకు గురైన అతడు ఆడపిల్లపై అసభ్యకరంగా ప్రవర్తించినా, పోలీసులు పట్టించుకోకపోవడం ఏమిటి అని తనలో తాను ఆవేదన చెందాడు. కువైట్ నుంచి వచ్చి, శనివారం తెల్లవారుజామున ఇంటి ఆవరణలో నిద్రిస్తున్న దివ్యాంగుడి తలపై ఇనుప రాడ్డుతో మోది హత్య చేశాడు. ఆ తరువాత వెంటనే కువైట్ వెళ్లిపోయాడు. ఇక, వికలాంగుడి హత్యపై వివరణ ఇస్తూ సోషల్ మీడియాలో వీడియో పోస్టు చేశారు. ఆడబిడ్డ తండ్రిగా తాను చేసింది న్యాయమేనని, పోలీసులకు లొంగిపోతానని తెలిపాడు. చట్ట ప్రకారం తమకు న్యాయం జరగకనే హత్య చేశానని ఆ వీడియోలో పేర్కొనడం కలకలం రేపుతోంది..