Dy CM Narayana Swamy: చంద్రబాబు పాలన రాక్షసరాజ్యం.. జగన్ పాలన రామరాజ్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dy CM Narayana Swamy Fires On Chandrababu Naidu: టీడీపీ అధినేత చంద్రబాబుపై డిప్యూటీ సీఎం నారాయణ స్వామి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు ఎస్సీలను ఆగర్భ శత్రువులుగా చూసేవాడని ఆరోపించారు. చంద్రబాబుకి పదవీదాహం తప్ప మరో దాహమే లేదని దుయ్యబట్టారు. చంద్రబాబు మేనిఫెస్టోని అసలు ప్రజలు పట్టించుకోవడమే మానేశారన్నారు. చంద్రబాబు తొలుత మేనిఫెస్టోలు పెట్టి, గెలిచిన తర్వాత మాయ చేస్తాడని విమర్శించారు. రామారావును వెన్నుపోటు పోడిచినవారే.. చంద్రబాబు వెంట ఉన్నారని అన్నారు. ఔరంగజేబుకు, చంద్రబాబుకు ఎలాంటి వ్యత్యాసం లేదన్నారు.
Best Cuisine: అత్యుత్తమ వంటకాలకు ఈ టాప్-10 దేశాలు కేరాఫ్
Also Read
- CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
- JC Prabhakar Reddy: తాడిపత్రిలో జేసీ వర్సెస్ కేతిరెడ్డి.. మున్సిపల్ ఎన్నికలపై హాట్ కామెంట్స్
- Dussehra Holidays 2026: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- AP Local Body Elections: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. సుప్రీంకోర్టు కీలక సూచనలు
ప్రధాని నరేంద్ర మోడీని నరరూప రక్షసుడు అని చెప్పి.. తీరా ఆ మోడీ కాళ్లే చంద్రబాబు పట్టుకున్నాడని నారాయణ స్వామి పేర్కొన్నారు. పవన్‌ని తిట్టిన చంద్రబాబు, ఇప్పుడు పదవీదాహంతో కీర్తిస్తున్నాడన్నారు. చంద్రబాబు మాల, మాదిగను చీల్చిన వ్యక్తి అని మండిపడ్డారు. 40 సంవత్సరాలు ఏ పనీ చేయని వ్యక్తి.. ఇప్పుడు పేదల్ని ధనవంతుల్ని చేస్తానంటూ మాయమాటలు చెప్తున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు దృష్టిలో పేదలంటే దోపిడీదారులు, కబ్జాదారులని వివరించారు. చంద్రబాబుతో కలవడానికి ఏం ఖర్మ పట్టిందోనని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు పాలన రాక్షసరాజ్యం అయితే.. జగన్ పాలన రామరాజ్యం అని అభివర్ణించారు. తమకు ముందస్తుకు వెళ్లే కర్మ లేదన్న ఆయన.. చంద్రబాబుకు దమ్ముంటే ఎన్టీఆర్ ఫోటో లేకుండా ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు.
Delhi Crime: యువతి అందుకు ఒప్పుకోలేదని.. కత్తితో దాడి చేసిన ప్రేమోన్మాది
అంతకుముందు కూడా.. చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టో ‘వెన్నుపోటు మేనిఫెస్టో’ అని నారాయణ స్వామి ధ్వజమెత్తారు. మినీ మేనిఫెస్టో అంటూ పచ్చి అబద్ధాలతో మళ్లీ ప్రజలను మోసం చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు చేశారు. చంద్రబాబు ఇలాంటి మేనిఫెస్టోలను ఎన్ని విడుదల చేసినా.. ఎన్ని జిమ్మిక్కులు చేసినా.. రాష్ట్ర ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన్ను నమ్మరని తేల్చి చెప్పారు. పిల్లనిచ్చి, రాజకీయ భిక్షపెట్టిన ఎన్టీఆర్‌కే వెన్నుపోటు పొడిచిన నీచుడు చంద్రబాబు అని, వెన్నుపోటుకు చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ ఎద్దేవా చేశారు. సీఎం వైఎస్ జగన్ పాలనలో ప్రజలంతా సుభిక్షంగా ఉన్నారని తెలిపారు.
తాజావార్తలు
-
RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
-
Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
-
CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్‌డౌన్!
-
Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
-
RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు