Delhi Crime: యువతి అందుకు ఒప్పుకోలేదని.. కత్తితో దాడి చేసిన ప్రేమోన్మాది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Boy Attacked Girl With Knife: దేశ రాజధాని ఢిల్లీలో ఓ దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ యువతిని వెంటాడి మరీ ఓ ప్రేమోన్మాది కత్తితో దాడి చేశాడు. ఆపై తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రస్తుతం ఆ యువతి పరిస్థితి విషమంగా ఉంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. అమిత్ అనే అబ్బాయి ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీలో పని చేస్తున్నప్పుడు, ఓ యువతితో పరిచయం అయ్యింది. తొలి చూపులోనే ఆమె అందానికి దాసోహమైన అమిత్.. ఆమె ప్రేమలో పడ్డాడు. ఆమెతో స్నేహం చేసి దగ్గరయ్యాడు. ఒక సమయంలో నిన్ను ప్రేమిస్తున్నాననంటూ తన మనసులోని మాట ఆ యువతికి చెప్పాడు. అయితే.. ఆ అమ్మాయి అతని ప్రపోజల్‌ని నిరాకరించింది. తనకు ఇలాంటివన్నీ ఇష్టముండదని చెప్పి, అతడ్ని దూరం పెట్టడం మొదలుపెట్టింది.
UP Love Tragedy: నా జీవితాన్ని నాశనం చేసింది.. నా చావుకి ప్రియురాలే కారణం
Also Read
- Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
- Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
- Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
- Anakapalli Tragedy: అనకాపల్లిలో విషాదం.. బాలిక, యువకుడి మృతితో విషాదం.. అసలేం జరిగింది?
కానీ.. అమిత్ మాత్రం ఆ అమ్మాయిని మర్చిపోలేకపోయాడు. తనని దూరం పెట్టడాన్ని కూడా జీర్ణించుకోలేకపోయాడు. ఆ అమ్మాయి వెంటపడటం ప్రారంభించాడు. నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నానని, నువ్వు లేకుండా ఉండలేనని చెప్తూ ఆమెను వేధించసాగాడు. తన జోలికి రావొద్దని ఆ యువతి తెగేసి చెప్పింది. దాంతో అతడు కోపాద్రిక్తుడయ్యాడు. ఆ యువతిపై ఉన్న ప్రేమ పోయి, అతనిలో ద్వేషం పెరిగింది. తనకు దక్కనిది ఇంకెవరూ దక్కకూడదని భావించి.. ఆమెని అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. ఎప్పట్లాగే అతడు జూన్ 2వ తేదీన ఆ అమ్మాయి వెంట పడ్డాడు. మళ్లీ తన ప్రేమ ప్రస్తావన తీసుకొచ్చాడు. అప్పుడు కూడా ఆ అమ్మాయి నిరాకరించింది. తన వెంట పడొద్దని గట్టిగా వారించింది. ఆ సమయంలో అమిత్ తన వెంట తెచ్చుకున్న కత్తి బయటకు తీసి, ఆ యువతిపై దాడి చేశాడు. అమ్మాయి కేకలు వేయడంతో.. చుట్టుపక్కల వారు సాయం కోసం పరుగులు తీశారు.
Chiranjeevi: నాకు క్యాన్సర్ లేదు.. అవాకులు చవాకులు పేలకండి.. చిరు వార్నింగ్
దాంతో అమిత్ భయపడి.. అక్కడి నుంచి పారిపోయాడు. నేరుగా ఆఫీస్‌కి చేరుకున్నాడు. అక్కడ వింతగా ప్రవర్తించిన అమిత్.. ఆత్మహత్య చేసుకున్నాడు. మరోవైపు.. అమిత్ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆ యువతిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు చెప్తున్నారు. ఈ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నారు. అమిత్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నాడు. కాగా.. కొన్ని రోజుల క్రితమే సాహిల్ అనే యువకుడు సాక్షి అనే బాలికను అత్యంత కిరాతకంగా చంపిన సంగతి తెలిసిందే! కనికరం లేకుండా అతడు సాక్షిపై 20 సార్లకు పైగా కత్తితో దాడి చేశాడు. ఆపై బండరాయి కూడా మోపాడు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది.
తాజావార్తలు
-
US sanctions on Russia: ట్రంప్ కొత్త ఆంక్షల చట్టంపై రష్యా తీవ్ర స్పందన.. శాంతి ప్రయత్నాలు కష్టతరం అవుతాయంటూ హెచ్చరిక
-
Nani New Movie: మలయాళ స్టార్‌తో సినిమా కోసం రంగంలోకి ‘ది ప్యారడైజ్’ హీరో!
-
Virat Kohli: సచిన్ టెండూల్కర్ ఆల్-టైమ్ రికార్డుపై కన్నేసిన విరాట్.. కోహ్లీ ముందు 3 భారీ మైలురాళ్ళు..!
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!