డాక్టర్ అంటే దేవుడితో సమానం అంటారు. ఓ డాక్టర్ నిర్లక్ష్యం తల్లిదండ్రులకు శోకం మిగిల్చింది. ఏలూరు జిల్లాలో ప్రభుత్వ వైద్యుడి నిర్లక్ష్యం కారణంగా నవజాత శిశువు చనిపోయింది. నిర్దాక్షిణ్యంగా నవజాత శిశువును పురిటిలోనే చంపేశారు డాక్టర్లు. ఏలూరు జిల్లాలోని ఉంగుటూరు మండలం కావుపాడు ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ నిర్వాకం బయటపడింది. డాక్టర్ ,సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా పురిటిలోనే కన్నుమూసింది నవజాత శిశువు. ఉంగుటూరు మండలం కావుపాడు గ్రామానికి చెందిన మేరీరత్నం 9నెలల గర్భిణీ. ఆమెకు సకాలంలో వైద్యం అందక కడుపులోనే మృతి చెందింది శిశువు.
డాక్టర్ల నిర్లక్ష్యమే శిశువు మృతికి కారణం అంటున్నారు బంధువులు. అయితే, తల్లి పరిస్థితి కూడా విషమంగా ఉంది. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆమెకు వైద్యం అందిస్తున్నారు డాక్టర్లు. యువతికి పురిటినొప్పులు రావడంతో ఆసుపత్రికి తీసుకువచ్చారు బంధువులు. సాధారణ ప్రసవం చేస్తామని ఆపరేషన్ థియేటర్‌కి తరలించి, గర్భిణీని అనేక ఇబ్బందులు పెట్టి నార్మల్ డెలివరీ చేస్తున్నామనే నెపంతో శిశువు తలకు తీవ్ర గాయాలు చేశారని గర్భిణి బంధువులు ఆరోపించారు.
ప్రసవ సమయంలోనే శిశువును బయటకు తీసే సమయంలోనే శిశువు తలను బాగా నలిపివేశారని అందుకే తలకు తీవ్ర గాయాలయ్యాయని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లు చెబుతున్నారని బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముందుగానే ప్రసవ సమయంలోనే శిశువు చనిపోయిందని గ్రహించాడు డాక్టర్. ఏమి చేయాలో తెలియక ఆపరేషన్ మధ్యలోనే వదిలి వెళ్లిపోయాడు డ్యూటీ డాక్టర్. డెలివరీ మధ్యలోనే డాక్టర్ ఎందుకు వెళుతున్నారని బంధువులు అడగగా మాట్లాడకుండా అక్కడ నుంచి ఉడాయించాడా డ్యూటీ డాక్టర్. డాక్టర్ వెళ్లిపోవడంతో యువతి బంధువులను హడావుడి పెట్టి, అర్జెంటుగా తాడేపల్లి గూడెం ఆసుపత్రికి తరలించాలని డాక్టర్ చెప్పారని ఇక్కడి నుంచి తీసుకు వెళ్ళాలని ఆస్పత్రి సిబ్బంది పట్టుబట్టారని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు.
చేసేదిలేక వెంటనే అక్కడి నుంచి తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్ళారు బంధువులు. పేషెంట్ కండిషన్ సీరియస్ గా ఉందని ఇక్కడి నుంచి తీసుకువెళ్లాలని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లాలని తాడేపల్లిగూడెం ఆసుపత్రి సిబ్బంది తెలిపారు. ఎటూ పాలుపోని పరిస్థితిలో గర్భిణిని కాపాడు కొనేందుకు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు బంధువులు. ఆపరేషన్ చేసి చనిపోయిన శిశువును బయటకు తీసేశారు డాక్టర్లు. అయితే ప్రస్తుతం తల్లి పరిస్థితి విషమంగా ఉందని, నాలుగు రోజులు గడిస్తే గాని ఏమీచెప్పలేమని డాక్టర్లు చెబుతున్నారని బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కావుపాడు ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ నిర్వాకం కారణంగానే శిశువు చనిపోయిందని,డాక్టర్, సిబ్బంది పై చర్యలు తీసుకోవాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు.
Maganti Gopinath : టీఆర్ఎస్ లో ఎమ్మెల్యేకు, కార్పొరేటర్ కు మధ్య సెగలు రేపుతున్న రగడ