గిరిజనుల సమస్యలు దశలవారీగా పరిష్కరించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని మంత్రి ధర్మాన కృష్ణ దాస్ అన్నారు. జిల్లాల విభజన అధ్యయనం జరిగిన తర్వాత తీసుకన్న నిర్ణయమే అని అన్నారు. ఈ సందర్భంగా ఆయన శ్రీకాకుళం జిల్లాలో మాట్లాడారు. సీఎం జిల్లాల గిరిజన పక్షపాతి అన్నారు. జిల్లా ఏర్పాటు పై ఏవైనా సమస్యలు ఉంటే అభిప్రాయాలను తెలియజేసే అవకాశాలను కల్పించామన్నారు. ప్రభుత్వం దృష్టికి సమష్యలు తీసుకువస్తే సాధ్యాసాధ్యాలను బట్టి నిర్ణయం తీసుకుంటామని ఆయన వెల్లడించారు. ప్రజలకు మేలు జరిగేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మంత్రి తెలిపారు. జిల్లాల విభజన నిర్ణయం ఇప్పటిది కాదని పాదయాత్ర సమయంలోనే ప్రజల సమస్యలను దృష్టిలో పెట్టుకుని తీసుకున్న నిర్ణయమని మంత్రి పేర్కొన్నారు.
Read Also: హిందూ దేవాలయాల వద్ద అన్యమత చిహ్నాలు దారుణం: సోము వీర్రాజు