New Districts In AP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలనా వ్యవస్థలో మరో కీలక మార్పు చోటుచేసుకుంది. రాష్ట్రంలో మూడు కొత్త జిల్లాల ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారికంగా ఆమోదం తెలిపారు. తాజా నిర్ణయంతో మార్కాపురం, మదనపల్లె, పోలవరం జిల్లాలు కొత్తగా ఏర్పడనున్నాయి. ఇందులో రంపచోడవరం కేంద్రంగా కొత్తగా పోలవరం జిల్లా ఏర్పాటు కానుంది. ప్రజలకు పరిపాలన మరింత చేరువ కావాలని, సేవల వేగవంతమైన అందుబాటు కోసం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. IP68+IP69 డ్యూయల్ ప్రొటెక్షన్,…
ఆంధ్రప్రదేశ్‌లో నూతన శకం ఆరంభం.. కొత్తగా 13 జిల్లాలతో మొత్తం 26 జిల్లాల్లో పాలన ప్రారంభించారు.. కొత్త జిల్లాలను సీఎం వైఎస్ జగన్.. క్యాంప్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఎలక్ట్రానిక్ బటన్ నొక్కి కొత్త జిల్లాలు అమలులోకి వచ్చినట్టు వెల్లడించారు సీఎం వైఎస్ జగన్.. పరిపాలన వికేంద్రీకరణ ద్వారా పాలనను ప్రజల చెంతకు మరింత దగ్గరగా తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు.. ఇక, కొత్త జిల్లాల ఏర్పాటును ఆహ్వానించారు…
కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియలో దూకుడు పెంచింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. వచ్చే నెల నుంచే కొత్త జిల్లాల నుంచి పరిపాలన సాగాలన్న సర్కార్ ఆదేశంతో చర్యలు ముమ్మరం చేశారు ఉన్నతాధికారులు. ఈ నెల 25వ తేదీలోగా కొత్త జిల్లాల్లో మౌళిక సదుపాయాలను ఏర్పాటు చేయాలని సీఎస్ సమీర్ శర్మ ఆదేశాలు జారీ చేవారు.. వివిధ శాఖల ఉన్నతాధికారులు, కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్ష నిర్వహించిన సీఎస్.. ఈ దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇక, రేపో, ఎల్లుండో కొత్త…
ఏపీలో కొత్త జిల్లాల అంశం వైసీపీ నేతల మధ్య చిచ్చుపెడుతోంది. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు, ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు మధ్య కొంతకాలంగా విభేదాలు ఉన్నాయని టాక్ నడుస్తోంది. తాజాగా జరిగిన ఘటన ఈ టాక్ నిజమే అనిపించేలా ఉంది. వివరాల్లోకి వెళ్తే.. నర్సాపురంను జిల్లా కేంద్రం చేయాలని బుధవారం నాడు అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. అనంతరం బైక్ ర్యాలీ కూడా చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కొత్తపల్లి…
గిరిజనుల సమస్యలు దశలవారీగా పరిష్కరించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని మంత్రి ధర్మాన కృష్ణ దాస్ అన్నారు. జిల్లాల విభజన అధ్యయనం జరిగిన తర్వాత తీసుకన్న నిర్ణయమే అని అన్నారు. ఈ సందర్భంగా ఆయన శ్రీకాకుళం జిల్లాలో మాట్లాడారు. సీఎం జిల్లాల గిరిజన పక్షపాతి అన్నారు. జిల్లా ఏర్పాటు పై ఏవైనా సమస్యలు ఉంటే అభిప్రాయాలను తెలియజేసే అవకాశాలను కల్పించామన్నారు. ప్రభుత్వం దృష్టికి సమష్యలు తీసుకువస్తే సాధ్యాసాధ్యాలను బట్టి నిర్ణయం తీసుకుంటామని ఆయన వెల్లడించారు. ప్రజలకు మేలు…
ఏపీలో నూతన జిల్లాలపై రచ్చ జరుగుతోంది. ఇటీవల ఏపీ ప్రభుత్వం కొత్త జిల్లాలపై ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రకటనను కొందరు ఆహ్వానిస్తుంటే.. మరికొందరు తప్పుపడుతున్నారు. ఈ సందర్బంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ.. మూడు రాజధానులకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇచ్చిన హామీ మేరకు ప్రతి పార్లమెంట్ ను జిల్లాగా సీఎం జగన్ ప్రకటించారని ఆయన అన్నారు. పరిపాలన సౌలభ్యం కోసం కొన్ని చోట్ల పలు ప్రాంతాలను కలిపారని, జిల్లాల పునర్విభజన…