ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైసీపీయే గెలిచేది.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డే మళ్ళీ సీఎం అవుతారని మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణ దాస్ తెలిపారు. జిల్లాలో పార్లమెంట్ గానీ.. అసెంబ్లీ గానీ ఆయన ఎవరు అభ్యర్ధి అంటే వారినే మనం కలిసి కట్టుగా పని చేసి గెలిపించాలి అని ఆయన పేర్కొన్నారు.
Dharmana Krishna Das: శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట వైసీపీ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. సారవకోట మండలం చీడిపూడి గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ఏపీలో ఎప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగినా జగన్ మరోసారి సీఎం అవుతారంటూ జోస్యం చెప్పారు. అలా జరగని పక్షంలో తాను ఎమ్మెల్యేగా గెలిచినా రాజీనామా చేస్తానని ధర్మాన కృష్ణదాస్ ప్రకటించారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, ఎవరితో…
ధర్మాన కృష్ణదాస్.. ధర్మాన ప్రసాదరావు. ఇద్దరూ సోదరులే. కృష్ణదాస్ డిప్యూటీ సీఎంగా చేస్తే.. మొన్నటి కేబినెట్ పునర్ వ్యవస్థీకరణలో అన్నను సాగనంపి.. తమ్ముడు ప్రసాదరావును మంత్రిని చేశారు. కృష్ణదాస్‌కు పార్టీ పగ్గాలు అప్పగించారు. కృష్ణదాస్ మంత్రిగా ఉండగా ప్రభుత్వ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చిన ప్రసాదరావు.. నేడు అన్న కృష్ణదాస్ పార్టీ అధ్యక్షుడిగా నిర్వహిస్తున్న కార్యక్రమాలకు తమ్ముడు డుమ్మా కొట్టేస్తున్నారు. మంత్రి పదవిలో ఉండగా దాసన్న చుట్టూ ప్రదర్శన చేసింది కేడర్. ప్రసాదరావు మంత్రి కావడంతో ఆ…
మాజీ డిప్యూటీ సీఎం, శ్రీకాకుళం జిల్లా వైసీపీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ సంచలన కామెంట్లు చేశారు. జిల్లాలో చాలా తమాషా నడుస్తోందని.. తనకు, ధర్మాన కృష్ణదాస్‌కు పడదంటూ కొందరు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తమ్ముడు ధర్మాన ప్రసాదరావు ఆయన గెలిచిన నరసన్నపేట తనకు ఇచ్చి శ్రీకాకుళం స్థానానికి వెళ్లాడని.. ప్రసాదరావు తమ కుటుంబానికి గౌరవం తెచ్చిన వ్యక్తి అని ప్రశంసించారు. అసలు తామిద్దరం ఎందుకు గొడవలు పడాలని ప్రశ్నించారు. పనికిమాలిన యదవలు మాట్లాడుతున్న…
ఎవరైనా డబ్బు, పేరు కోసం రాజకీయాల్లోకి వస్తారు.. కానీ, సీఎం వైఎస్ జగన్ వేరు అన్నారు మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్.. మంత్రి పదవి నుంచి ఆయనను తప్పించిన సీఎం వైఎస్ జగన్.. పార్టీ బాధ్యతలు అప్పజెప్పిన విషయం తెలిసిందే.. ఇవాళ శ్రీకాకుళం జిల్లా వైసీపీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన ధర్మాన.. పరీక్షా సమయంలో పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టడం ఆనందంగా ఉందన్నారు.. అధ్యక్ష బాధ్యతల్లో నియమించిన జగనన్నకు కృతజ్ణతలు తెలిపారు.. ఇక, ఈ సందర్భంగా…
మర్మం లేకుండా మాట్లాడేస్తారు. మెలితిప్పే కామెంట్స్ అస్సలు ఉండవు. సూటిగా సుత్తిలేకుండా చెప్పేస్తారు. ఇన్నాళ్లూ ఆయన ఏం చెప్పినా చర్చే. ఇప్పుడు మాత్రం ఆయన మంత్రి. అభినందన సభలోనే నర్మగర్భ వ్యాఖ్యలతో కలకలం రేపారు. కాకపోతే ఆ ధర్మ సూక్తులు ఎవరికన్నదే ప్రస్తుతం ప్రశ్న. హాట్ టాపిక్‌గా మంత్రి ధర్మాన కామెంట్స్ ధర్మాన ప్రసాదరావు. తాజా మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో చోటు దక్కించుకున్నారు. చాలా గ్యాప్ తర్వాత మంత్రి హోదాలో జిల్లాకు రావడంతో అభిమానులు, పార్టీ కార్యకర్తలు శ్రీకాకుళం…
ఆంధ్రప్రదేశ్‌లో మంత్రులపై చర్చ జరుగుతోన్న సమయంలో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను మంత్రిగా దిగిపోతున్నానని, తన సోదరుడు ధర్మాన ప్రసాదరావు మంత్రి కాబోతున్నారని పేర్కొన్నారు.. గతంలో తమ్ముడు ప్రసాదరావు మంత్రిగా ఉన్నప్పుడు… నరసన్నపేట ఉపఎన్నికలో తనపై మరో సోదరుడు రామదాసును బరిలోకి దించాడని.. ఆ ధర్మ యుద్ధంలో తానే గెలిచానని కృష్ణదాస్ గుర్తుచేసుకున్నారు.. 2019 ఎన్నికల్లో తమ్ముడు ప్రసాదరావు కూడా వైసీపీ నుంచి పోటీ చేశారు.. ఎన్నికల్లో ఇద్దరం గెలిచామని చెప్పారు.…