ఒకప్పుడు పరిస్థితి వేరు. ఇప్పుడు పరిస్థితి వేరు. అంతా పరిస్థితులు తారుమారవుతున్నాయి. నిజానికి ఒకానొక సమయంలో సినిమాలు ఎలా ఉన్నా హీరోల అభిమానులు మాత్రం వాటిని భుజాల మీద మోసేవారు. “మా హీరో సినిమా బానే ఉంది. కావాలనే మీరు నెగటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు,” అంటూ సినిమా మీద నెగిటివ్‌గా మాట్లాడిన వారి మీద విరుచుకుపడేవారు. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారిపోతున్నాయి. సినిమా బాలేదంటే ముందు అభిమానులే ట్రోల్ చేస్తున్నారు. “ఇలాంటి సినిమాలు నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేసేది?” అంటూ నేరుగా హీరోలను సోషల్ మీడియాలో ట్యాగ్ చేసి మరీ ప్రశ్నిస్తున్నారు.
Also Read: PM మోదీ :దివాళీ నాటికి జీఎస్టీ రేట్లు తగ్గించి ప్రజల ఆనందాన్ని రెట్టింపు చేస్తాం !
ఈ మధ్యకాలంలో వచ్చిన ‘కింగ్‌డమ్’, వార్ 2, కూలీ సినిమాలు పూర్తిస్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. కొంతమందికి నచ్చినా, సింహభాగం వాటిని చూసి సంతృప్తి చెందలేదు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో విపరీతంగా ఈ సినిమాలను ట్రోల్ చేస్తున్నారు. అయితే, వారంతా ఇతర హీరోల అభిమానులు ఏమో అనుకుంటే పొరపాటే. ఆయా సినిమాల హీరోల అభిమానులు స్వయంగా సినిమా నచ్చలేదని బహిరంగంగా ముఖం మీద చెప్పేస్తున్నారు. కాబట్టి, ఇకమీదటైనా హీరోలు కేవలం రెమ్యునరేషన్లు, లెక్కలు వేసుకోకుండా, కంటెంట్ ఉన్న సినిమాలతో వస్తేనే బెటర్ అని చెబుతున్నారు. ఎందుకంటే, ఒకప్పటిలా భుజాన మోస్తూ వచ్చిన అభిమానులు కూడా ఇప్పుడు వారిని రిజెక్ట్ చేస్తున్నారు.