వచ్చే ఎన్నకలలో నేను నగిరి నుండి పోటీచేస్తానని ప్రచారం చేయడం తప్పుడు ప్రచారం అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. రాజ్యసభ అవకాశం వస్తేనే తీసుకోకుండా అజీజ్ పాషా కు ఇచ్చాం. పదవి కాంక్ష లేదు. బురద జల్లే ప్రయత్నం చేయొద్దు. “పేగసస్” వ్యవహారం తమ ప్రభుత్యంను అస్తిర అస్థిరపరిచే అంతర్జాతీయ కుట్ర అంటున్న మోడీ ప్రభుత్వం విచారణ కు ఎందుకు భయపడుతోంది. జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసి విచారణ జరిపించాలి అన్నారు.
ఇక ఏపీ లో మైనింగ్ మాఫియా రాజ్యమేలుతోంది. దేవినేని ఉమను కొట్టి తిరిగి ఆయనపైనే కేసు పెట్టారు. ఆంధ్ర ప్రదేశ్ లోని పరిస్థితుల పై కేంద్రం జోక్యం చేసుకోవాలి. “దళిత బంధు” పథకాన్ని స్వాగతిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలి. 5 గురు తప్ప కేసీఆర్ కేబినెట్ లో మిగిలినవారంతా సమైక్య వాదులు అని తెలిపారు. టీఆర్ఎస్ పరిస్ఠితి అద్దె ఇల్లు లాగా తయారైంది అని పేర్కొన్నారు.