పేదల ఇళ్ల స్థలాల పేరుతో భారీ అవినీతి: రామకృష్ణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పేదల ఇళ్ల స్థలాలు.. ఇళ్ల నిర్మాణంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రభుత్వం పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో భారీ అవినీతి జరిగిందని తెలిపారు. ఇళ్ల స్థలాల కోసం ప్రైవేట్ వ్యక్తుల నుంచి రూ. 10 వేల కోట్లతో ప్రభుత్వం కొనుగోలు చేస్తే.. రూ. 4 వేల కోట్ల అవినీతి చోటు చేసుకుందన్నారు.ఇళ్ల స్థలాల కొనుగోళ్ల విషయంలో ఓ ఎంపీని సీఎం జగన్ చెంప మీద కొట్టారని మాకు సమాచారముందన్నారు. ఈ ప్రభుత్వం పేదలకు కట్టించేవి ఇళ్లు కాదు.. పందుల గూళ్లుఅని సంచలన వ్యాఖ్యలు చేశారు.గ్రేటేడ్ కమ్యూనిటీ తరహాలో ఇళ్లు కట్టిస్తున్నామంటూ సజ్జల ప్రజలను భ్రమల్లో ఉంచుతుతున్నారని పేర్కొన్నారు.
Read Also:జాతీయ స్థాయిలో అల్లూరికి గుర్తింపు రాలేదు: మంత్రి శ్రీనివాస్‌గౌడ్
Also Read
- IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
- Vijayawada to Amaravati: విజయవాడ నుంచి అమరావతికి రాజబాట.. రూ.1000 కోట్లతో మరో బ్రిడ్జి..
- CM Chandrababu: ‘పునాది వేశా.. ప్రాజెక్ట్ పూర్తి చేశా’.. వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం చంద్రబాబు..
- Veligonda Project Phase 1: వెలిగొండ ఫేజ్-1 ప్రారంభం.. 10.70 టీఎంసీల కృష్ణా జలాలు విడుదల చేసిన సీఎం చంద్రబాబు
పేదలకు కట్టించే ఇంటిలో సజ్జల తన కుటుంబంతో 24 గంటల పాటు ఉండగలరా..? తాడేపల్లిలో ప్రభుత్వం నిర్మించిన మోడల్ హౌస్ ఉంది.. అక్కడ సజ్జల 24 గంటలపాటు కుటుంబంతో ఉండగలరా..? ఇంటి సామాను మేమే లారీలో తరలిస్తాం. సీఎం జగన్ ఇంటి బాత్రూం కంటే పేదలకు ఇచ్చే ఇంటి స్థలం తక్కువగా ఉందని విమర్శించారు. పేదల ఇళ్ల కోసం పల్లెల్లో మూడు సెంట్లు.. అర్బన్‌లో రెండు సెంట్ల స్థలం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అమరావతి పరిధిలో నిర్మించిన టిడ్కో ఇళ్లను కేటాయించకుండా ప్రభుత్వం సైంధవుని మాదిరిగా అడ్డుపడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం డబ్బులివ్వాలని రైతులు ధర్నాలు చేస్తుంటే పొలం గట్టు మీదే డబ్బులిస్తున్నామని సజ్జల ఎలా చెబుతారు..?ఈ నెల 10వ తేదీన సీఎం క్యాంప్ కార్యాలయం ముట్టడి చేస్తామని పేర్కొన్నారు. పెన్షన్ల విషయంలో జగన్ మాట తప్పారు. రూ. 3 వేలు ఇస్తామన్న సీఎం జగన్.. నిన్నటి వరకు రూ. 2250 ఇచ్చారు.. ఇప్పుడు రూ. 2500 ఇస్తున్నారని ఆరోపించారు.
తాజావార్తలు
-
Allu Arjun : రాకా హైప్ ఓకే.. కంటెంట్ ఆ రేంజ్ లో లేక పోతే?
-
CM Revanth Reddy : హైదరాబాద్‌కు కొత్త రూపు.. మూడు కార్పొరేషన్ల లోగోలు
-
Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్‌కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
-
IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
-
Kavitha : నిజామాబాద్ సభలో కవిత కన్నీళ్లు.. ఆ మాటలేంటి.?
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!