Chinta Mohan: 2024లో కాంగ్రెస్, టీడీపీ మధ్యే పోటీ.. వైసీపీ, బీజేపీ తుడిచిపెట్టుకుపోతాయి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2024లో సార్వత్రిక ఎన్నికలు రాబోతున్నాయి.. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయా పరిణామాలు మారబోతున్నాయి.. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ మధ్యే పోటీ ఉంటుందని జోస్యం చెప్పారు.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్.. తిరుపతిలో ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కన్యాకుమారిలో మొదలై ప్రస్తుతం మహారాష్ట్రలో సాగుతుందన్నారు.. చిన్నా భిన్నం అవుతున్న దేశాన్ని కాంగ్రెస్ పార్టీ మళ్లీ ఏకం చేస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేసిన ఆయన.. నోట్ల రద్దుతో దేశంలో ఆర్థిక కష్టాలు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు..
Read Also: Heavy Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం..! ఏపీలో భారీ వర్షాలు..
Also Read
- AP IAS Transfers 2026: 22 మంది IAS అధికారుల బదిలీలు.. కీలక శాఖల్లో మార్పులు.. ఆమ్రపాలికి నో పోస్టింగ్..
- Medico Priyanka: మెడికో ప్రియాంక పరిస్థితి విషమం.. మద్యం మత్తులో కారుతో తొక్కించిన ఉన్మాదులు..
- OTR : టీడీపీ సీనియర్ నేత కళా వెంకట్రావుకు గడ్డుకాలమా? పార్టీలో తగ్గిన ప్రాధాన్యతపై చర్చ
- OTR : మంత్రి పార్థసారధిపై మైనింగ్ ఆరోపణలు.. నూజువీడులో రాజకీయ రగడ
మరోవైపు.. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని తెలిపారు చింతామోహన్.. వైసీపీ ప్రభుత్వం దళితుల సంక్షేమ పథకాలు ఎత్తేసి ద్రోహం చేస్తోందన్న ఆయన.. రాబోయే ఎన్నికల్లో వైసీపీ, బీజేపీలు తుడిచిపెట్టుకుపోతాయన్నారు.. 2024 ఎన్నికల్లో రాజకీయ ఎన్నికల యుద్ధం కాంగ్రెస్, టీడీపీ మధ్యే జరుగుతుందని పేర్కొన్నారు చింతామోహన్. కాగా, రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర.. కన్యాకుమారిలో ప్రారంభమై కాశ్మీర్ వరకు సాగనుంది.. ఇప్పటికే తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ముగిసిన జోడో యాత్ర.. ప్రస్తుతం మహారాష్ట్రలో కొనసాగుతోన్న విషయం విదితమే.. తాను చేపట్టిన పాదయాత్రకు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తుందని.. లక్షలాది మంది కదలివస్తున్నారని.. దేశాన్ని సమైక్యం చేసేందుకు భారత్ జోడో యాత్ర చేపట్టానని పలు వేదికలపై రాహుల్ గాంధీ ప్రకటించిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్‌కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్‌ఫ్లిక్స్‌లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!