Jishnu Dev Varma has taking charge as a Governor of Telangana: ఇదివరకే తెలంగాణ గర్నవర్ గా నియమితులైన జిష్ణుదేవ్ వర్మ నేడు బుధవారం పదవీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రాజ్ భవన్‌లో నేటి సాయంత్రం 5.03 గంటల సమయంలో ఆయన గవర్నర్ గా పదవీ బాధ్యతలు చెపట్టబోతున్నట్లు రాజ్‌భవన్ పేర్కొంది. 2 రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం 9 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించిన విషయం మనకు తెలిసిందే. ఈ లిస్ట్ లో తెలంగాణ గర్నవర్ గా నియమితులైన జిష్ణుదేవ్ వర్మను నియమించారు. ఇకపోతే 1957 ఆగస్టు 15న స్వా తంత్ర దినోత్సవం రోజున జన్మించిన జిష్ణుదేవ్ వర్మ 2018 నుండి 2023 వరకూ త్రిపుర రాష్ట్ర డిప్యూటీ సీఎంగా పని చేశారు. అంతేకాకుండా గతంలో బాడ్మింటన్ అసోషియేషన్ ఆఫ్ ఇండియాకు కూడా అధ్యక్షుడిగా వ్యవహరించారు.
Gold Price Today: సడెన్ షాకిచ్చిన బంగారం ధరలు.. ఒక్కరోజే తులంపై రూ.870 పెరిగింది!
జిష్ణుదేవ్ వర్మ త్రిపుర రాజ కుటుంబానికి చెందిన వ్యక్తి. ఆయన 1990లో రామ జన్మభూమి ఉద్యమ సమయంలో పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో పార్టీలో చేరారు. ఇక అప్పటి నుంచి ఆ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తూ రాబాదంతో.. త్రిపుర ప్రభుత్వంలో ఆయన మంత్రిగా విద్యుత్, గ్రామీణాభి వృద్ధి, పంచాయితీ రాజ్, ఆర్ధిక, ప్రణాళిక, సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణ శాఖల బాధ్యతలను నిర్వహించారు.
Manushi Chhillar Dating: మాజీ సీఎం మనవడితో హీరోయిన్ మానుషి డేటింగ్?