విశాఖ జిల్లాలో వాహనాలపై నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్ కుప్పకూలింది. అనకాపల్లి జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో రెండు కార్లు, ఓ ట్యాంకర్ ధ్వంసం కాగా.. ఇద్దరు మృతి చెందారు. హైవే విస్తరణ కోసం ఫ్లై ఓవరన్ నిర్మిస్తున్నారు. బీంలు పెద్ద శబ్దంతో కూలడంతో అక్కడి జనం పరుగులు తీశారు. ఇక ప్రమాదంలో పలుగురికి గాయాలు కాగా.. వారిని ఆస్పత్రికి తరలించారు.
read also : ఈటల నోటి వెంటరాని జై శ్రీరాం నినాదం!
సైడ్ బీంలు కిందపడి … కారు, ట్యాంకర్ నుజ్జు నుజ్జు అయ్యాయి. ప్రస్తుతం ఘటనా స్థలం దగ్గర సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఆనంద పురం నుంచి అనకాపల్లి వరకు జాతీయ విస్తరణ పనులు జరుగుతున్నాయి. అనకాపల్లి జనగల మదం జంక్షన్ లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతులు అనకాపల్లి నూకాలమ్మ తల్లి దర్శనానికి వచ్చిన వారిగా పోలీసులు గుర్తించారు. ఇక వంతెన కూలడంతో ఘటన స్థలం దగ్గర ట్రాఫిక్ జామ్ అయింది.